Monday, December 21, 2009
ట్రాక్‌పై విద్రోహ చర్యకు యత్నం
కావలి రూరల్, మేజర్‌న్యూస్: పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు ఉత్తరాన ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లు దుండగులు శుక్రవారం రాత్రి తొలగించి విద్రోహ చర్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నెల్లూరు రైల్వే డిఎస్పీ భాస్కర్‌నాయుడు, ఇన్‌స్పెక్టర్ విజయకుమార్‌ల ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ట్రాక్‌మెన్ బి కొండయ్య స్టేషన్ నుంచి మొదటి దఫా రౌండ్‌కు చెకింగ్‌కు వెళ్లాడు. కావలికి ఉత్తరం వైపు ఊరి చివరన ఐదుమంది గుర్తు తెలియని దుండగులు ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లను తొలగించడాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. ఎందుకు తొలగిస్తున్నారని ట్రాక్‌మెన్ అడగడంతో అతనిపై దాడి చేశారు.222/5/3కి.మీ వద్ద చెనై్న వైపు వెళ్లే అప్‌లైన్ నుంచి 13క్లిప్పింగ్‌లను తొలగించి అపహరించారు. అనంతరం కొండయ్య విషయాన్ని హుటాహుటినా స్థానిక రైల్వే పోలీసులకు సమాచారమందించారు. లైన్‌కు నూతన క్లిప్పింగ్‌లను అమర్చి ముప్పు నుంచి తప్పించినట్లు పోలీసులు తెలిపారు. క్లిప్పింగ్‌లను అపహరించాలనుకుంటే అవి దుండగులకు ఎక్కడయినా దొరుకుతాయన్నారు. కానీ పథకం ప్రకారమే పట్టాలకు ఉన్న క్లిప్పింగ్‌లను తొలగించి రైలు ప్రమాదాలు చేసేందుకే వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే విద్రోహ చర్యను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వారితోపాటు బిట్రగుంట రైల్వే ఎసై్స సత్తార్, సిబ్బంది ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment