online marketing

Tuesday, March 6, 2012

కోవూరు ఉప ఎన్నికలో ప్రతివ్యూహాలతో లోపల టెన్షన్‌గా నాయకులు..

కోవూరు : కోవూరు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సి పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు వ్యూహ, ప్రతివ్యూహాలతో రాష్ట్ర నాయకులను ప్రచారాల్లో ఉపయోగించుకుంటూ రాజకీయ ఆరంగేట్రం తిప్పుతున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలతో, అసభ్య పదజాలాలతో మాట్లాడుకుంటూ గెలుపు తనదంటే తనదంటూ పోటీ పడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 4వ తేదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరులో రోడ్‌షో నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. అదేవిధంగా 5, 6 తేదీల్లో వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు కొంత మేర వచ్చారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలంలోని రేగడిచెలికలో రాత్రి 10 గంటలు దాటిన సందర్భంలో ప్రచారం నిర్విహ స్తున్నారన్న ఉద్దేశ్యంతో జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అదేవిధంగా 6వ తేదీ మైపాడు కొరుటూరు రోడ్డు సమీపంలో 20 మంది మత్స్యకారులు, జగన్‌ భద్రతా సిబ్బంది మధ్య తోపులాట జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది.

ఈ రెండు సంఘటనలతో జగన్‌కు చేదు అనుభవం ఎదురైనట్లయింది. కొంతమంది రెండు పార్టీల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అంతుపట్టని ధోరణి ప్రజలకు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారానికి కూడా ప్రజలు కొంత మేర వస్తున్నారు. దీన్ని బట్టి ఓటరు నాడిని చెప్పలేని పరిస్థితిలో నాయకులున్నారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులే గాక పలు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎవరి ఓట్లు ఎటు చీలుతాయో తెలియని పరిస్థితి కూడా ఉప ఎన్నికలో నెలకొంది. అంతేకాకుండా ప్రచారాలైతే జోరుగా జరుగుతున్నాయి. ప్రజలైతే వస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్తున్నారు. మార్చి 18 జరుగనున్న ఓటింగ్‌లో ప్రజల ధోరణి ఏ విధంగా ఉంటుందో అంతు చిక్కని విధంగా వుంది. జయాపజయాలపై ఎవరి ధీమాతో వాళ్లు ఉన్నప్పటికీ లోలోపల టెన్షన్‌గా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మార్చి 21న జరుగబోవు కౌంటింగ్‌ రోజే నాయకుల భవితవ్యం ఖరారు కానుంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh