online marketing

Wednesday, March 7, 2012

కోవూరు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి డిఎల్‌ఓలు ఓటరు స్లిప్పులు


కోవూరు : ఓటర్లకు అధికారులు అందజేసిన స్లిప్పులుంటే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ బి. శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గోల్డెన్‌ జూబ్లీహాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోవూరు ఉప ఎన్నికలను సజావుగా జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం నుండి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి డిఎల్‌ఓలు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తారన్నారు. అందరూ ఇంటివద్ద ఉండాలని, అలా లేనివారు స్థానిక అధికారుల సహకారంతో వారంలో ఎప్పుడైనా తీసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారులు ఇతర గుర్తింపు కార్డులను అనుమతిస్తారన్నారు. ఈనెల 12వ తేదీ నుండి వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇవిఎంల పరిశీలన జరుగుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ నోటీసులు జారీ చేశామని వారి సమక్షంలో అవసరమైతే మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించామని తెలిపారు. వారికి ఈనెల 9, 14, 15 తేదీల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. అందుకు అధికారులంతా హాజరుకావాలని, ఎవరైనా హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద మైక్రో అధికారులుగా నియమించామన్నారు. 12వ తేదీన వీరికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేయనున్నామని, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఎక్కడ నుండైనా పోలింగ్‌ సరళిని చూసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం, డబ్బు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామని, కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎనిమిది, జిల్లా సరిహద్దుల్లో ఏడు మొత్తం 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభమైనందున ప్రతిపార్టీ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికారపార్టీకి అధికారులు సహకరిస్తున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు జరిగిన తరువాత తాము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తామన్నారు. నాయకులు వచ్చే సమయంలో కూడా పార్టీలు కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని, సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 16వతేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని ముగించాలన్నారు. కలెక్టరేట్‌లో కంప్లైంట్‌ సెల్‌ ఏర్పాటు చేశామని, అందులో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పొదుపు మహిళల అకౌంట్‌లో కొన్ని రాజకీయపార్టీలు డబ్బు వేస్తున్నారన్న ప్రచారంపై ఇప్పటికే డిఆర్‌డిఎ పిడిని విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం వద్ద అందరి అకౌంట్‌ నెంబర్లు ఉంటాయని, అందులో పరిశీలన జరుపుతామని తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh