నెల్లూరు : సమాజంలో, సామాజిక సేవల్లో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జర్నలిస్టుల గ్రూప్ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవను జర్నలిస్టులు అంకితభావంతో పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎపియుడబ్ల్యుజె యూనియన్ కృషి చేయాలన్నారు.
జిల్లాలోని 520 మంది జర్నలిస్టులకు ప్రతిఏటా బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని సత్యంజీ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత గోపిశెట్టి సత్యనారాయణ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.5.20 కోట్లు బాండును అందజేయడం పట్ల కలెక్టర్ సత్యంజీని అభినందించారు.
గ్రూప్ ఇన్సూరెన్స్‌ల బాండ్‌ల ఆవిష్కరణ సందర్భంగా ఎపియు డబ్ల్యుజె యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌ను, సత్యంజీ అధినేత సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సత్యంజీ మాట్లాడుతూ భవిష్యత్తులో జర్నలిస్టుల బీమా పథకానికి ఇదేవిధంగా అయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.జయప్రకాష్, జిల్లా నాయకులు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, బాబు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment