వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్.జగన్ శుక్రవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి బయలుదేరి నెల్లూరు నగరానికి చేరుకుంటారు. అక్కడ నుంచి దర్గామిట్టలోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో వున్న మేకపాటి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. తొలుత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై తిరిగి వెళ్లాలని భావించినప్పటికీ, జిల్లాలో పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక రోజంతా జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 8 గంటలకు కనపర్తిపాడు మెయిన్ బైసాప్ రోడ్డు వద్ద కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం కనపర్తిపాడులో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు మేకపాటి అతిథి గృహం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.10 నిమిషాలకు నెల్లూరు నగరంలో జడ్పీ మాజీ ఛైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్య నివాసానికి వెళ్తారు. అనంతరం రాపూరు, వేపినాపిలకు వెళ్లి వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి కడపకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి

No comments:
Post a Comment