దగదర్తి, : దగదర్తి పోలేరమ్మ జాతర నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఫిబ్రవరి మొదటి మంగళవారంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. పాడి పంటలను, ప్రజలను చల్లగా చూసే తల్లి పోలేరమ్మ అన్నది భక్తుల విశ్వాసం.
ఈ జాతరకు చుట్టు పక్కల మండలాలు, జిల్లాలనుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. మొక్కులు చెల్లిస్తారు. సోమవారం తెల్లవారుజామున డప్పు వాయిద్యాలు, శంఖు మోతలు, సన్నాయి రాగాలతో అమ్మవారిని మేల్కొలుపులతో ప్రారంభమయ్యే జాతరలో అభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, సాయంత్రం కలశస్థాపన, సామూహిక సహస్రనామావళి, కుంకుమపూజ, పల్లకీ సేవలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం అ భిషేకం, చల్ది, పొంగళ్లు, మధ్యా హ్నం అన్నదానం, సాయంత్రం పూలంగిసేవ అనంతరం రాత్రికి గ్రామోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతరలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
పోలీసు బందోబస్తు జాతర సందర్బంగా ఎలాంటి గోడవలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని దగదర్తి ఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, సిబ్బంది మఫ్టీలో సైతం విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు

No comments:
Post a Comment