నెల్లూరు :శుక్రవారం రాత్రి స్థానిక ఎసి.సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీరు లేకపోతే.... మా రాజకీయ జీవితాలే లేవని, ఈ పదవులు రావని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాము ప్రజలకు అందుబాటులో ఉండలే మని పేర్కొన్నారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు ఆయన సూచించారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని ఆయన వారికి సూచించారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకునే ఆనవాయితీ ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేలము అయినామని ఆయన తెలిపారు. వ్యక్తికన్నా పార్టీ, వ్యవస్థ గొప్పదని ఆయన తెలిపారు. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.150 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే సమస్యలపై ప్రశ్నించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నెల్లూరుకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వల్ల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు. సమస్యలు తీర్చాలని ఫోన్‌లు వస్తుంటాయని, వాటిని ప్రతిఒక్కరూ ముందుండి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు ఆయన సూచించారు. వివేకానందరెడ్డి అసెంబ్లీలో చాలా ఎక్కువ ప్రశ్నలు వేసే ఎమ్మెల్యే అని ఆయన పేర్కొన్నారు. వివేకాను చూచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. వివేకాను చూస్తే చంద్రబాబుకు కూడా భయమని ఆయన తెలిపారు.
అసెంబ్లీలో ప్రజల అవసరాలను తీర్చేందుకు మంచి ప్రశ్నలు వేయడం జరుగుతుందన్నారు. అలాగే మీడియాపై, రిజర్వేషన్‌పై, మరికొన్నింటిపై ప్రశ్నలు వేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, ద్వారకనాధ్, జాకీర్, మాజీ కార్పొరేటర్ మేకల నరేంద్రరెడ్డి, పిండి సురేష్ తదితరులున్నారు.

No comments:
Post a Comment