online marketing

Sunday, February 5, 2012

ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు జిల్లాలో రాష్ట్ర మంత్రులు

ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిలు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని డిపిఆర్‌ఒ ఎం.కమలాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో రోడ్డు, స్కూల్‌ భవ నానికి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇన్‌చార్జ్‌ మంత్రి పితాని సత్యనారాయణలు శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే ఉదయం 10 గంటలకు సాంఘీక సంక్షేమ శాఖాధికారులతో సమీక్షిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ హాస్టల్‌ భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 

అక్కడ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు కోవూరులో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజ్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 9వ తేదీ ఉదయం 10 గంటలకు వెంకటగిరిలో ఎకై్సజ్‌ సిఐ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, 10.30 గంటలకు డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ప్లాను యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు సూళ్లూరుపేటలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే 10వ తేదీ ఉదయం 10 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డితో కలసి నెల్లూరు ఆర్‌డిఒ కార్యాలయం ఆవరణంలో నిర్మించిన జిల్లా ల్యాండ్‌ అండ్‌ సర్వే కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొంటారన్నారు. 

అలాగే ఎసి స్టేడియంలో జరుగుతున్న జిల్లా రెవెన్యూ శాఖ క్రీడలను ప్రారంభిస్తారని, జిల్లా ప్రభుత్వాసుపత్రులలో డయాలసిస్‌ యూనిట్‌ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆత్మకూరులో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ప్లాన్‌ యూనిట్స్‌ను మంత్రి ఆనం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ నెల 11వ తేదీ నెల్లూరు ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో స్ర్తీశక్తి భవనానికి, భూగర్భజల శాఖ భవనానికి రూ.20 కోట్లతో సిసి రోడ్డుకు మంత్రి ఆనం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే నెల్లూరు ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజ్‌ యాక్షన్‌ప్లాన్‌ యూనిట్స్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పంపిణీ చేస్తారన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh