కలువాయి: పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ప్రజల్లో పట్టు సాధించేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. గతంలో ఒక్క పంచాయతీపైనే దృష్టిసారించిన మాదాసు ఇటీవలకాలంలో మండలంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూండటంతో ప్రజలనుంచి ఆయనకు ఆదరణ పెరుగుతోంది. మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి అభివృద్ధి విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటంతో దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్న గంగాధరం ముందడుగు వేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను పలుచోట్ల ఏర్పాటు చేసి ప్రజలు అభిమానం చాటుకున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. మండలంలో అభివృద్ధి పనులకోసం కోట్లాది రూపాయల నిధులను రాబట్టడంలో ఆయన విజయం సాధించారు.
గత సంవత్సరం డిసెంబరు నెలలో రచ్చబండ కార్యక్రమంలో సాక్షాత్తు రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులను కలువాయి మండలానికి తీసుకొచ్చి పనులు మంజూరుకు కృషి చేశారు. తోపుగుంట అగ్రహారంలోని దేవాలయానికి రూ. 25 లక్షలు, రామన్నగారిపల్లెలోని అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు విడుదల చేయించి పేరుతెచ్చుకున్నారు. ఫలితంగా మాదాసుకు కలువాయిలో ఓ బలమైన వర్గం నాయకులు దగ్గరయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆయన అనుచరవర్గానికి విజయావకాశాలు. అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి.

No comments:
Post a Comment