online marketing

Monday, February 6, 2012

స్కీముల పేరిట మహిళలను ఆశచూపి సుమారు రూ. 6 లక్షలకు పైగానే టోకరా

కలువాయి : స్కీముల పేరిట మహిళలను ఆశచూపి సుమారు రూ. 6 లక్షలకు పైగానే టోకరాపెట్టి ఉడాయించి ఉదంతం మండల కేంద్రమైన కలువాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్కీముల పేరుట మొదట ఐదుగురు మహిళలచే కలువాయిలోని ప్రతి వీధిలో ఓ 20 మంది సభ్యులను చేర్చుకొని ప్రతిరోజు లాటరీ పేరిట మహిళలపై ఆసచూపి మొదటిగా లాటరీలో వచ్చిన బహుమతులను ఆ సభ్యులకు నిర్వహకుడు ఇవ్వడం జరిగింది. మొదటి సారిగా ఇవ్వడంతో మహిళలు ఈ స్కీము బాగుందన్న ఉద్దేశ్యంతో ఒక్కొ బజారులో 20 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఆ స్కీమును, మళ్లీ కొత్తస్కీము అంటూ 100 సభ్యులతో ఏర్పాటు చేసి అలా సుమారు కలువాయిలో 20 గ్రూపులను ఏర్పాటు చేశాడు. రోజుమార్చిరోజు ఈ లాటరీని 15 రోజులపాటు లాటరీ డ్రాలను తీస్తుండేవాడు.

ఈ డ్రాలో గెలుపొందిన విజేతలకు స్టీలు వస్తువులను ఇస్తుండేవాడు. ఈ లాటరీ నెలరోజులపాటు జరగాల్సివుంది. 30 సభ్యులు ఉన్న డ్రాలో గెలుపొందిన ఇస్తామని, మిగిలిన 70 మంది సభ్యులకు ఏదొకవస్తువు ఇస్తామని ఆశచూపాడని స్కీము కట్టిన మహిళలు తెలిపారు. బాధితులు ఇచ్చిన వివరాల మేరకు ఒక్కో గ్రూపులో 15 మందికి మాత్రమే వస్తువులను ఇచ్చినవీరు మేము ఇప్పటి వరకు ఒక్కోక్కరం రూ.400ల వంతున వారికి చెల్లించామని వారు తెలిపారు. ఈ లాటరీలో సుమారు 2వేల మంది సభ్యులుగా చేరడం వారిలో 300 మందికే లాటరీద్వారా వచ్చిన వస్తువులను ఇవ్వడం జరిగింది. దీన్నిబట్టి చూస్తే సుమారు ఆరు లక్షల రూపాయలు నగదును తీసుకొని ఉడాయించడం జరిగిందని తెలుస్తోంది. ఈ నిర్వాహకులు ఇలా మరో మండలానికి వెళ్లి ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కనుక ఇప్పటికైనా లాటరీలు నిర్వహించే నిర్వాహకులను అదుపులోకి తీసుకొని మహిళలు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనావుంది. ఈ విషయంపై పోలీసులకు ఎటువంటి సమాచారంలేదు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh