online marketing

Friday, February 10, 2012

కార్యకర్తలకు అభివాదం చేస్తూ...ఎదురు వచ్చిన జనాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ జిల్లా పర్యటన ముగించుకుని వెళ్లారు.

నెల్లూరు :  శుక్రవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరుకున్న జగన్‌కు రేల్వేస్టేషన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేల్వేస్టేషన్‌ నుంచి ఆయన నేరుగా దర్గామిట్ట ప్రాంతంలోని మేకపాటి అతిథి గృహానికి చేరుకున్నారు.

ఉదయం 8.30గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కనపర్తిపాడుకు వెళ్లారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్‌, జడ్పీమాజీ చైర్మన్‌ కాకాణి గోవర్ధనరెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు అరగంట సేపుఅక్కడ గడిపారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి అతిథిగృహానికి బయలుదేరారు. మార్గ మధ్యలో కనపర్తిపాడు వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళఇర్పించారు. అక్కడకు చేరకున్న కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉదయం 10 గంటలకు మేకపాటి అతిథిగృహానికి చేరుకున్నారు. జగన్‌కు పూలమాలలు, కండువాలు వేయడానికి అభిమానులు కార్యకర్తలు ఎగబడ్డారు. అక్కడ తనను కలువడానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను చిరునవ్వుతో పలుకరించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో మేకపాటి అతిథిగృహం కిక్కిరిసిపోయింది.
కార్యకర్తలతో పలకరింపు అనంతరం జగన్‌ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పొదలకూరురోడ్డులోని జడ్పీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ బాలచెన్నయ్యకు చెందిన ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడి కొద్దిసేపు గడిపిన తర్వాత రాపూరుకు బయలుదేరి వెళ్లారు.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం కార్యకర్తలకు అభివాదం చేస్తూ...ఎదురు వచ్చిన జనాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ జిల్లా పర్యటన ముగించుకుని వెళ్లారు. జగన్‌ వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర నేతలు వెళ్లారు. రాపూరు, వేపినాపిలలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం డక్కిలి, వెంకటగిరిలలో తనను చూడటానికి వచ్చిన కార్యకర్తలను పలుకరించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రాంతంలో రోడ్డు మార్గాన కడపకు బయలుదేరి వెళ్లారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh