నెల్లూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్‌సి పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడప గడపకు వైఎస్‌ఆర్‌సి పార్టీని తీసుకెళ్లేందులో భాగంగా ఆయన చేపట్టిన 141 రోజుల పాదయాత్ర 82వ రోజుకు చేరుకుని అల్లీపురం గ్రామంలో కార్యకర్తల కోలాహలం మధ్య అపూర్వ స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మరణానంతరం పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తూట్లు పొడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ వుందా..లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ పార్టీ నేతలు దోచుకొని దాచుకోవడం తప్ప వేరే ధ్యాస లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసులో ఇరికించే పనిలో ముఖ్యమంత్రి సోనియా గాంధీ వద్ద నిమగ్నమైవున్నారన్నారు. వీళ్ల తంతును చూచి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

No comments:
Post a Comment