online marketing

Friday, February 26, 2010

మానవత్వం మంటగలిపి మానవతా విలువలను....

ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: స్థానిక మండలంలో రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. దీంతో మానవతావిలువలను ఈ ప్రాంత తల్లులు కొందరు దిగజారుస్తున్నారన్ని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణకు పురిటిలో పుట్టి మరణించిన ఆడ పసికందులను ఆసుపత్రులలోనే వదిలివేయడం, అక్కడి సిబ్బంది ఆబిడ్డలను ముళ్ళపొదలలో పడవేసి కుక్కలపాలు చేయడం వంటి సంఘటనలు ఉదయగిరి పట్టణంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి సంఘటనలను వెలుగులోనికి రానివ్వకుండా ఉండేందుకు అవినీతి మంత్రంతో అణగ దొక్కుతున్నారు. దీంతో చట్టాలు సైతం స్పందనలేకుండా పోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా నేటి సమాజంలోని చట్టాలు నిరుపేదలకు తప్పా డబ్బున్న మారాజుల ఖరీదుకు తలొగ్గుతున్నాయి అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణకు ఉదయగిరిలో బుధవారం మృతిచెందిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడవేసిన సంఘటన చూపరులనుసైతం కలచి వేసింది. ఈ పని నోరు లేని జంతువులు సైతం ఇలాంటి సంఘటనలకు పాలుపడవు. కానీ అన్నీకలిగిన మానవజాతికి ఎందుకింత అహంకారం, నిర్లక్ష్యం. చనిపోయిన పసికందులను ఖననం చేయలేని తల్లిదండ్రులు ఎందుకు బిడ్డలకు జన్మనిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాలుపడుతున్న దుర్మార్గులపై సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్ధంకావడంలేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముళ్ళపొదల్లో పడేసిన మృతిశిశువును ఖననం చేశారా లేదా అనేవిషయాన్ని స్థానిక పోలీసు అధికారులు సైతం పరిశీలించకపోవటం ఈ ఘటనకు పాలుపడిన వ్యక్తులను నేటికీ గుర్తించక పోవటంలో ఆంతర్యం ఏమిటీ అనేది ప్రశ్నార్ధకంగా ఉందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునారావృతం కాకుండా వుండాలంటే సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి బుధవారం మృత శిశువును ముళ్ళపొదల్లో పడేసిన దయలేని తల్లి దండ్రులపై చర్యలు తీసుకొని సమాజంలో మానవతా విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh