రాష్ట్రంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి కుమ్మకై్క తనను ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఉప ఎన్నికలో విజయం సాధిస్తానని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇరుపార్టీలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కిరణ్, చంద్రబాబు రాజకీయాలను మంత్రి డిఎన్ సమర్థించారన్నారు.