online marketing

Wednesday, December 5, 2012

తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా

వరుణుడు ఎట్టికేలకు జిల్లా ప్రజానీకంపై కరుణ చూపారు. జిల్లాలో ఎక్కడ చూసిన భారీ వర్షాలకు ఆదివారం అర్ధరాత్రి నుండి వరుణుడు కరుణ చూపడంతో వర్షాలు ఆశించిన స్థాయిలోనే కురుస్తున్నాయి. జిల్లాలోని రైతాంగం ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయి. అన్ని చెరువులు నేడు కొత్త నీరు జలకళతో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు పరవళ్ళు తోక్కుతూ పారుతున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. దీనితో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్య రహదారులు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుండి వర్షాలు అధిక శాతంలో కురుస్తుండడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో తడ అత్యధికంగా 2.10 సెంటీ మీటర్లు నమోదు అయ్యింది. అదేవిధంగా అత్యల్పంగా ఉదయగిరిలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనది. మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అంతటా విస్తార ంగా వర్షాలు కురిశాయి. నగరంలోని అన్ని ప్రదానా రహదారులు జలమయంగా మారాయి. జిల్లాలోని అన్ని ప్రధానా రహదారులు దెబ్బ తిన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల నుండి ఇప్పటికే వేసుకొన్న నారుమళ్ళును కాపాడుకొవడానికి రైతులు నానాకష్టాలు పడ్డారు. తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా గడిపారు. 

భారీ వర్షాలకు పెరుగుతున్న అలల ఉదృతీకి తోడు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర భయాదోళనకు లోనైయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎటువంటి కూలి పనులు లేక కూలీలు పూట గడవక అవస్థలు ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యత్మాక గ్రామాలకు ఆర్టీసి అధికారులు బస్సు సర్విసులను నిలిపివేశారు. భారీ వర్షాలకు జిల్లాలోని కొన్ని చిన్నచిన్న బ్రిడ్జిలు, చప్టాలు స్వల్పంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కల్పింగింది. నగరంలో చిన్న చిన్న వ్యాపారులు చేసుకొనే వారు ఈ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పు చేసి కొన్న సరుకులు అమ్ముడుపోకా లభోదిభోమంటూన్నారు. నగరంలోని ఆత్మకూరు, విజయమహల్‌గేల్‌, మాగుంటలేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జీలలో నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతారాయం కల్గింది.నగరంలోని ఆర్‌డిఒ, తహసిల్దార్‌ కార్యాలయాలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఉరుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్‌డిఒ కార్యాలయం లోపలి గోడలు కొన్ని చోట్ల పగుళ్లు ఇచ్చివుండడంతో కార్యాలయంలోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో కార్యాలయంలోని పలు ఫైళ్లు తడుస్తున్నట్లు తెలుస్తోంది. పురాతన కట్టడం కాబట్టి గోడలు పగుళ్లు ఇచ్చి కొద్దిపాటి చినుకు పడితే వర్షపునీరు కార్యాలయం లోపలికి గోడల నుంచి ప్రవేశిస్తున్నాయి. దీంతో సిబ్బంది అనేక ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. అలాగే తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దూరప్రాంతాల నుంచి తమ సమస్యలను అధికారుల వద్ద విన్నవించు కునేందుకు తరలి వస్తుండడంతో వారు ఈ ప్రాంతంలో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్‌డిఒ కార్యాలయంలో ఉన్న స్వల్ప సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాగే ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా వుంది.

Tuesday, October 9, 2012

ఆత్మాభిమానం దెబ్బతిన్న యువకుడు తల్లి చూస్తుండగానే ఆత్మహత్య

నెల్లూరు: నెల్లూరు నగరంలో 18 ఏళ్ల ఓ యువకుడిని సెల్‌ఫోన్‌ చోరీ చేశాడని తీవ్రంగా కొట్టడంతో ఆ యువకుడు మనస్తాపంతో తల్లి ఎదుటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు ఇచ్చిన రహస్య సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. స్థానిక టెక్కేమిట్టలో తమిళనాడు రాష్ట్ర అరక్కోణంకు చెందిన ఆర్ముగం సుమారు 20 ఏళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చి టెక్కేమిట్టలోని రెైల్వేగేటు సమీపంలో పూరిపాక వేసుకుని నివసిస్తున్నాడు. ఇతనికి మహేష్‌, రూపేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్‌ చదువుకుంటుండగా రూపేష్‌ పెయింటింగ్‌ పనికి వెళ్తూ ఇంటికి సహాయపడేవాడు. రూపేష్‌ వారి ఇంటి సమీపంలో నివసించే కమతం రమణయ్య కుమారుడు రమేష్‌ తో పెయింటింగ్‌ పనికి వెళ్లేవాడు. గత నెల వినాయ చవితి సందర్భంగా రూపేష్‌ రమేష్‌తో పాటు ఉండగా రమేష్‌ సెల్‌ఫోన్‌ కనిపించలేదు.

దీంతో రమేష్‌ కోపోద్రిక్తుడెై నువ్వే సెల్‌ఫోన్‌ దొంగిలించావని అంటూ రూపేష్‌పెై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అప్పటికీ శాంతించని రమేష్‌ రూపేష్‌ను తీసుకుని వారి ఇంటి వద్దకే వెళ్లగా రూపేష్‌ తల్లిని ఇంటిలో నుండి పిలిచి ఆమె ఎదుటే రూపేష్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ మరలా కొట్టాడు. కొద్దిసేపటికి రమేష్‌ వెళ్లిపోగా తల్లి ఎదుటే తనకు ఇంత అవమానం జరగడంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న రూపేష్‌ తల్లి చూస్తుండగానే ఇంటి పక్కనే వున్న రెైల్వేట్రాక్‌ వెైపు పరుగెత్తుకుని వెళ్లి అప్పుడే అటు వెళ్తున్న రెైలుకు అడ్డం పడ్డాడు. రూపేష్‌ను రెైలు ఢీకొనడంతో అక్కడికక్కడే రూపేష్‌ మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మృతుడు రూపేష్‌ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుమారుడి మృతదేహం వద్ద కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలిసి రమేష్‌ వారి వద్దకు వెళ్లి వారిని కేసులు పెట్టకుండా బెదిరించి రూపేష్‌ మృతదేహాన్ని కాల్చి బూడిద చేసేలా వారిపెై ఒత్తిడి తెచ్చారు. 

అనంతరం కొద్ది రోజులు రమేష్‌ పరారీలో ఉండి విషయం చల్లబడిందని తెలిసి బయటకు వచ్చినట్లు సమాచారం. మీకు మరో కొడుకు వున్నాడని, ఈ విషయం బయటకు చెబితే వాడిని చంపేస్తానంటూ మృతుడి తండ్రిని రమేష్‌ , అతని కుటుంబ సభ్యులు బెదిరించినట్లు, తాము రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి బతుకుతున్నామని, ఇక్కడ తమకేదెైనా జరిగితే దిక్కే లేదని, అందుకే విషయం బయటకు చెప్పలేకపోయామని రూపేష్‌ తండ్రే మీడియా అని తెలియక విలేకరులకు తెలిపాడు. ఆలస్యంగా వెలుగు చూచిన ఈ సంఘటనపెై రెైల్వే పోలీసులకు కాని, ఇటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు కాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ వ్యక్తులు రూపేష్‌ కుటుంబ సభ్యులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి వారిని నోరు మూయించారు. దీనిపెై పోలీసులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేసు మూత పడినట్లేనని రమేష్‌ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇకనెైనా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఈ కేసును పరిశోధించి నిజాలను నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి నేరస్తులను శిక్షించాల్సివుంది

సైకో కత్తితో వీరంగం...

చేజర్ల: చేజర్లలోని స్థానిక బస్టాండు సెంటరు వద్ద సైకోగా మారిన మొద్దు వెంకట రమణయ్య కత్తితో వీరంగం సృష్టించడంతో ఇద్దరు యువకులు గాయాల బారినపడి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మొద్దు వెంకట రమణయ్య గత కొంతకాలంగా చేజర్ల బస్టాండు సెంటరువద్దగల దుకాణాల సెంటర్లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం డబ్బులు విషయంలో జరిగిన చిన్న ఘర్ణణతో అతను సైకోగామారి ఆదివారం ఉదయం కత్తితో అహ్మద్‌బాషా, రియాజ్‌ అనే యువకులపెై దాడిచేసి గొంతుపెై గాయపరిచాడు. అతని సమీపంలోని మరొక యువకుడు రియాజ్‌ మోచేతిపెై గాయపరిచాడు. 

బస్టాండు సెంటరు వద్ద రిక్షాతోలుకుంటూ జీవనం గడుపుతున్న అహ్మద్‌బాషాకు తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరిని 108సాయంతో వెైద్యచికిత్సలకోసం నెల్లూరు ప్రభుత్వ వెైద్యశాలకు తరలిం చారు. సైకోగామారిన మొద్దు రమణయ్య బస్టాండు సెంటరు వద్ద వీరంగం సృష్టిస్తూ దగ్గరికి వెళ్లినవారిపెై దాడిచేయడం మొదలుపెట్టాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరంధామయ్యపెై సైతం ఆ సైకో దాడికి దిగడంతో అతను తృటిలో ప్రమాదంనుండి తప్పించుకు న్నాడు. బస్టాండులోని ప్రజలు అతని వద్దకు వెళ్లాలంటే భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలసి సమిష్టిగా అతన్ని పట్టుకొని అతనివద్ద నుండి కత్తిని తీసివేసి పోలీస్‌ సిబ్బంది సహకారంతో పోలీస్టేషన్‌లో అప్పగించడం జరిగింది. 

అయితే ఇతడు గతంలో ఆదురుపల్లి సెంటరు వద్ద ఒక మహిళ చెవిని కోయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని గ్రామం నుండి తరిమివేయడం జరిగింది. ఇతను చేజర్ల మండలం పెళ్లేరు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఇతను ఏ గ్రామంలోవున్నా అక్కడ ఏదోఒక గొడవచేసి పలువురుని గాయపరచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చేజర్ల బస్టాండు వద్ద జరిగిన సంఘటనతో ప్రజలు సైకో ప్రవర్తనపెై భయాందోళనలు చెందుతూ బిక్కుబిక్కుమంటున్నారు. ఇతను బయట సంచరిస్తే అనేకమందిని గాయపరచి ప్రాణాలు తీసే ప్రమాదంవుందని గ్రామస్తులు తెలుపుతు న్నారు. స్థానిక ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ సైకోను అదుపులోకి తీసుకొని అతనిపెై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా ఆయన తెలిపారు. 

ప్రజల సహకారంతో ఇటువంటి వ్యక్తులను అదుపుచేయడం జరుగుతుందన్నారు. ఎవరెైనా అనుమానిత వ్యక్తులుగా సంచరిస్తుంటే పోలీస్టేషన్‌లో సమాచారాన్ని అందించాలన్నారు. ఇటువంటి వారిపెై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పరంధామయ్య, కానిస్టేబుల్‌ రఫిలు పాల్గొన్నారు.

Monday, September 24, 2012

ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం


నెల్లూరు : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర యూనిట్ నెల్లూరులో సోమవారం సందడి చేసింది. చిత్ర విజయయాత్రను నెల్లూరు నుంచే ప్రారంభించారు. నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం ఒక్కసారిగా రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు చిత్రంలో నాగరాజు పాత్రధారి సుధాకర్, అభి(కౌషిక్), శ్రీను(అబుజిత్), సురేష్ (సంజీవ్) హాల్‌లో ప్రేక్షకుల మధ్య సందడి చేశారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారు. 

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ సినిమా ఎలా ఉందంటూ అడిగిన ప్రశ్నకు బాగుందని యువత నుంచి కేరింతలతో సమాధానం వచ్చింది. నెల్లూరు నుంచి విజయయాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని శేఖర్ కమ్ముల అన్నారు. యువత తమ జీవితాలను సంతోషంగా గడపాలని సూచించారు. అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు వెంకటరెడ్డి, బుజ్జి, పురప్రముఖులు ఉదయభాస్కర్, బట్టేపాటి నరేంద్ర, కామేశ్వరరావు, శివ, ఎస్2 మల్టిప్లెక్స్ యాజమాన్య బృందం పాల్గొన్నారు. 

Sunday, September 23, 2012

కరెంటు కోతలు వేసవి కాలాన్ని మరపించే రీతిలో .. మధ్యతరగతి ప్రజలు సైతం ఇన్వర్ట్టర్ల కొనుగోలు


ఇన్వర్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌
రాపూరు: ఇటీవల కాలంలో అప్రకటిత విద్యుత్‌ కోతలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు నిమిత్తం ఉపయోగించే ఇన్వర్టర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపారులు, నివాసితులు సైతం అధిక సంఖ్యలో ఇన్వర్ట్టర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ శాఖ విధిస్తున్న కరెంటు కోతలు వేసవి కాలాన్ని మరపించే రీతిలో తీవ్రతరమవుతున్నట్లు మండల ప్రజానీకం వాపోతున్నారు. పగటి పూట కనీసం ఐదు గంటల పాటు కూడా విద్యుత్‌ సరఫరా అందకపోవడంతో పాటు రాత్రుళ్లు నిర్వీరామంగా విధిస్తున్న కరెంటు కోతల వలన తీవ్ర అవస్థల పాలవడం ఈ మధ్యకాలంలో మండల ప్రజలకు రివాజుగా మారింది. ఇక గ్రామాల్లో అయితే చెప్పనవసరమే లేదు. కరెంటు సరఫరా ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందోనన్న అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

దీంతో కార్యాలయ సేవలందించే నిమిత్తం అధికారులు, వ్యాపారులు, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వర్టర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాటికి డిమాండ్‌తో పాటు తీవ్ర గిరాకీ ఏర్పడింది. ఈక్రమంలో డిస్టిబ్యూటర్లు రంగ ప్రవేశం చేసి వాడవాడలా వ్యాపార కరపత్రాలను అందిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అప్రకటిత కరెంటు కోతలు తట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు సైతం ఇన్వర్ట్టర్ల కొనుగోలుపెై దృష్టిసారిస్తున్నారు. వివిధ రకాల కంపెనీల పేరుతో ఇన్వర్టర్లను మార్కెట్‌లోకి దిగుమతి చేసి రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. 

Friday, September 21, 2012

నెల్లూరులో పలుచోట్ల రికార్డు డ్యాన్సులు.47 మంది రికార్డు డ్యాన్సర్లను అరెస్టు


నెల్లూరు: శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని లాడ్జీ ల్లో దాడులు నిర్వహించి 47 మంది రికార్డు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. నెల్లూరులో స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఒకటి, మూడు స్టేషన్ల పరిధిలోని పలు లాడ్జీల్లో తనిఖీలు చేశారు.

బృందావనంలోని ఆదర్శ్, బాబుఐస్‌క్రీం సందులోని మౌర్యా, గాంధీబొమ్మ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ లాడ్జీలపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సు మారు 48 మంది రికార్డు డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓ నిర్వాహకుడు దాడుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నిందితులను ఒకటి, మూడో పోలీసుస్టేషన్‌లకు తరలించి కేసులు నమోదు చేశారు. వినాయకచవితి ఉత్సవాల్లో రికార్డు డ్యాన్సులు, స్టేజ్‌డ్యాన్సులు నిషేధిస్తున్నామని 15రోజుల ముందు నుంచి నిర్వాహకులను హెచ్చరిస్తున్నామని ఎస్పీ బి.వి రమణకుమార్ తెలిపారు.

శుక్రవారం రికార్డు డ్యాన్సర్ల అరెస్ట్ నేపథ్యంలో మూడోనగర పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలో కొందరు నిర్వాహకులు రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను తీసుకొచ్చారని తెలిపారు. వారిని రహస్యంగా లాడ్జీల్లో ఉంచారని పేర్కొన్నారు. అనంత రం వారితో ఇప్పటికే పలుచోట్ల రికార్డు డ్యాన్సులు వేయిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జీలపై దాడులు నిర్వహించామన్నారు. నగరంలో 48 (22 మంది మహిళలు, 25 మంది పురుషులు)మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిలో రమణ అనే వ్యక్తి తప్పించుకున్నారని చెప్పారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర ఇన్‌చార్జి డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ రాంబాబు, నార్త్, సౌత్ సర్కిల్ సీఐలు సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఒకటోనగర ఇన్‌చార్జి ఎస్‌ఐ, మూడోనగర ఎస్‌ఐలు ఖాదర్‌బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నా

Thursday, May 17, 2012

చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో..

నెల్లూరు: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాదు నుండి తిరుపతి విమానంలో వచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు కూడా అదే విమానంలో తిరుపతి వచ్చారు. ఇద్దరు ఒకే విమానంలో రావడం విశేషం. అంతేకాదు తిరుపతిలో దిగిన అనంతరం చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో నెల్లూరుకు వచ్చారు. మోహన్ బాబు మరో కారులో తిరుపతి సమీపంలో తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ కళాశాలకు వెళ్లారు. కావలి వచ్చిన చిరంజీవి మాజీ శాసన సభ్యురాలు మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి ఎవరూ అతీతులు కారని అవినీతి, అక్రమాల కేసులో ఎ-1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఎప్పుడైనా అరెస్టు కాక తప్పదని అన్నారు. నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం కావలిలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకొని పోతుందని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ అనేవారని, ప్రస్తుతం జగన్ విషయంలోను ఇదే జరుగుతోందని చెప్పారు. జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని రోడ్‌ షోలో చిరంజీవి అన్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోడానికి అవసరమైన భద్రత కోసం సిఎం కుర్చీ కావాలని పాకులాడుతున్నాడే తప్ప ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. వైయస్ మరణానంతరం కాంగ్రెస్‌పార్టీని కాపాడాలని సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరితే పట్టెడన్నం పెట్టిన తల్లి లాంటి పార్టీని తన స్వార్థం కోసం కాలదన్ని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్ ప్రయత్నించగా, దాన్ని అడ్డుకోడానికి తాను ప్రయత్నించానన్నారు. కొందరు అధికార దాహంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అంతకుముందు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అన్నారు. పారిశ్రామికవేత్తలను కొందరు స్వార్థపరులు ప్రలోభపెట్టి.. అవినీతిలో కూరుకుపోయేలా చేయడం వల్లే వారు జైళ్లకు పోవాల్సిన పరిస్థితి దాపురించిందని, అందుకు సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్‌లే ఉదాహరణ అని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి రావడానికే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు. ఉప ఎన్నికలలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Sunday, May 13, 2012

మానవత్వం మరచిన తల్లి

మానవత్వం మరచిన తల్లి
- ముళ్లపొదల్లో పసిపాప
- మాతృదినోత్సవం రోజు దారుణం
- ఆదరించిన అంగన్‌వాడీ మణెమ్మ
పొదలకూరు : అయ్యో ‘పాప’ం ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో చేతులు ఎలా వచ్చాయోకానీ మాతృదినోత్సవం రోజున ముక్కుపచ్చలారని పసికందును ముళ్లపొదల పాలుచేసింది. ఆడపిల్ల అనుకుందో, తప్పటడుగు పాపమో, ఏమైతేనేమి కనీసం బొడ్డుకూడా ఊడని పసిబిడ్డను నిర్దయగా వదిలేసి వెళ్లింది. ఈ ఉదతం పొదలకూరులో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని శివాలయం వీధి సమీపంలో ముళ్లచెట్ల పొద కింద పసిపాప ఏడుస్తుండటాన్ని స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త మణెమ్మ గమనించింది. వెంటనే ఆ పసిబిడ్డను తన ఇంటికి తీసుకువచ్చి సఫర్యలుచేసి పాలుపట్టించింది. అనంతరం ఈ విషయాన్ని సిడిపిఓ దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా సిడిపిఓ సత్యకుమారి మాట్లాడుతూ పాపకు మూడు రోజుల వయస్సు ఉంటుందన్నారు. పాప సంరక్షణ నిమిత్తం నెల్లూరులోని శిశుగృహంకు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త మణెమ్మ పాల్గొంది.

Saturday, May 12, 2012

స్కాన్సిస్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే స్నేహం సెక్స్‌ కోసమేనని తేల్చిచెప్పి....

స్ర్తీ, పురుషూల మధ్య స్నేహం ఎంత పవిత్రమైనదైనా కావచ్చు... కానీ అంతర్లీనంగా ఆ బంధాన్ని కట్టిపడేసేది మాత్రం ‘అదే’... అన్న అభిప్రాయం సర్వే సర్వత్రా వినవస్తూనే ఉంటుంది... ఇప్పుడు అదే నిజమని సర్వేలోనే తేలింది... విస్కాన్సిస్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే స్నేహం సెక్స్‌ కోసమేనని తేల్చిచెప్పింది. ష్నేహం’ త్యాగాన్ని కోరుతుందని, ప్రేమ గుడ్డిదని ఎవరైనా అంటే పప్పులో కాలేసినట్లే. ‘దేరీజ్‌ నో రియల్‌ లవ్‌...ఆల్‌ ఆర్‌ లస్ట్‌’...ఆడా, మగా మద్య నిజమైన ప్రేమ అంతా వ ట్టిదేనని...అదంతా ఆ ర్షనేనని లండన్‌కు చెందిన విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సర్వే ఆధారాలతో సహా తేల్చి చెప్పింది. ఆపోజిట్‌ జెండర్‌ మద్య స్నేహం కేవలం సెక్స్‌ కోసమేనని ఆ సంస్థ కుండబద్దలు కొట్టింది. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...అన్నా...స్నేహానికన్న మిన్న...

అని పాటలెన్ని పాడుకున్నా అంతిమంగా ఆడా మగా మద్య స్నేహం ‘ఆ దాహాన్ని’ తీర్చుకునేందుకేనని ఈ సర్వే నివేదిక బట్టబయలు చేసింది. ఏ దేశంలో చూసినా...ఖండాంతరాలు దాటినా కామానికి ఉన్న సహజ స్వభావం అదేనని సర్వే నిపుణులు వెల్లడించారు. అయితే గతంలో లాగా ఇప్పుడు కామం తీర్చుకునే ందుకు జీవితంలో సెటిల్‌ అయ్యేంతవరకు ఎవరూ ఆగడం లేదు. టీనేజ్‌గా పేరున్న థర్టీన్‌ ఏజ్‌నుంచే కామకలాపాలు అవకాశమున్న చోటల్లా ఆడేందుకు అబ్బాయిలూ...అమ్మాయిలూ పోటీలు పడుతున్నారట. సినిమా, మీడియా, ఇంటర్నెట్‌ ద్వారా చేతివేళ్ల దూరంలో ఉండే పోర్నోసైట్‌లు అమూల్యమైన బాల్యాన్ని పెడతోవ పట్టిస్తున్నాయి.

ఇంటర్నెట్‌, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్ల పుణ్యమే
ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు, ఆర్క్యూట్‌, ఫేస్‌బుక్‌లాంటి సైట్లతో యువత ఆపోజిట్‌ జెండర్‌తో స్నేహాలు చేసేందుకు భీజం పడుతోంది. దీనిద్వారా స్నేహం పేరుతో పరిచయం ఎల్లలు దాటుతోంది. ఒకరి పర్సనల్‌ విషయాలు మరొకరితో షేర్‌ చేసుకోవడం, ఛాటింగ్‌లతో మనసు తీరక వారు స్నేహం ముసుగులో కలుసుకునే తీరిక చేసుకుంటున్నారు. ఇదే వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఆపోజిట్‌ అట్రాక్షన్‌తో తెలియనివారితో సెక్స్‌లో పాల్గొంటూ అవసరం లేని సుఖాలను అర్దంకాని వయసులోనే అనుభవిస్తున్నారు.

స్నేహం పేరుతో సెక్సే
ఎక్స్‌క్యూజ్‌మీ...మీరే కాలేజ్‌ అని అడిగి స్నేహం కోసం చేతులు చాచే మగాళ్లలో అధికులు మనసులో ఓ మూల సెక్సే లక్ష్యంగా స్నేహం చేస్తున్నారట. మిమ్మల్నెక్కడో చూశాను అని కొందరు...మీరు చాలా అందంగా ఉన్నారు ఇట్స్‌ మై కాంప్లిమెంట్‌ అని స్నేహం పేరుతో దగ్గరయ్యే పురుషుల్లో కామవాంఛే అంతిమ లక్ష్యమని ఈ నివేధిక స్పష్టం చేసింది. స్నేహం పేరుతో మహిళలకు దగ్గరయ్యే పురుషుల్లో 90శాతంమంది సెక్సే కావాలని ఆఫర్‌ చేస్తారని...అందినకాడికి ఆడదానితో కామం తీర్చుకునే చర్యలకు నిస్సిగ్గుగా పాటుపడతారని ఈ సంస్థ ఆదారాలతో రుజువు చేసింది. అయితే సమాజంలో మహిళలు ఎంతగా పరిణితి సాధించి అభివృద్దివైపు అడుగులు వేస్తున్నప్పటికీ...సెక్స్‌ కావాలని ప్రపోజ్‌ చేయడంలో పురుషులదే అగ్రస్థానమని సర్వేలో వెల్లడైంది. సాంప్రదాయానికి విలువిచ్చే ఆసియా దేశాలకు తోడు...అభివృద్ది చెందిన యూరప్‌, అమెరికా దేశాలలోనూ స్నేహం పేరుతో మొగ్గతొడిగిన పరిచయమే సెక్స్‌వైపు అడుగులు వేయిస్తోందని ఈ సర్వే రుజువు చేసింది.

శోధనలో తేలిందిదే
సంచలనం సృష్టించిన ఈ సర్వే సంస్థ తన పరిశోధనకోసం 18నుంచి 52ఏళ్ల మధ్య వయస్సున్న 400మంది స్ర్తీ, పురుషులను ఎంచుకున్నారు. ఎంపిక చేసిన వీరిని వయసుల వారీగా విభజించారు. 18నుంచి 23 ఏళ్లకు ఒక వర్గంగా, 27నుంచి 52ఏళ్ల వరకు మరో గ్రూపుగా వీరిని విభజించారు. వీరి వ్యవహారాన్ని, వారిలోని స్నేహభావాన్ని అధ్యయనం జరిపేందుకు 88 జంటలను విడివిడిగా గదుల్లో ఉంచి వారికి ఏకాంతాన్ని కల్పించారు. కొంత కాలం తర్వాత వారిలో స్నేహ భావం ఎంతలా పెరిగిందని ప్రశ్నించగా...అందులోని అందరు పురుషులూ ఒకటే మాట చెప్పారట. తమకు స్నేహం సంగతి దేవుడెరుగు ఎప్పుడు పక్కలోకి చేరి సెక్స్‌ ఎంజాయ్‌ చేద్దామా అన్న కోరికలతో రగిలి పోయామని వారు సెలవిచ్చారట. అయితే మహిళామణులు మాత్రం తాము ‘ఆ’ దృష్టితో చూడలేదని చెప్పారట.

నో హీరోస్‌... అంతా స్వార్దమే
సినిమాల్లో చెప్పినట్లుగా...హీరో యిజాన్ని చూపేందుకు కథానాయకుడు హీరోయిన్‌ వెంటపడుతున్నా ప్రవరాఖ్యుడి టైప్‌లో పక్కకు తప్పుకునే సిత్రం ఈ కాలంలో లేదని వీరు రుజువు చేశారు. కామంలేని స్నేహం...లైలా మజ్నూ లవ్‌లు లేవని నిర్దద్వంగా తేల్చిచెప్పిన ఈ సర్వే చూసి మనవాళ్లు ఇది ఎప్పుడో మాకు తెలిసిన విషయమే అన్నట్లుగా విరగబడి నవ్వుతున్నారట. అసలు మహిళల శరీరాకృతే సెక్స్‌ను ప్రేరేపించేదిలా ఉంటుందని...కొందరిని చూస్తేనే బ్రహ్మకైనా రిమ్మ తెగులు తరహాలో కామం ప్రకోపిస్తుందని పురుష పుంగవులు కటువుగా అంటున్నారు. కామా తురాణాం...న భయం...న లజ్జ అన్న సామెతను వారు అక్షరాల పాటిస్తున్నట్లవుతోంది. అయితే అసలు ఆపోజిట్‌ జెండర్‌ అంటేనే సెక్స్‌ అనేవారు లేకపోలేదు. మనసుల్లో అంతగా కోరిక రెచ్చిపోవడానికి అతివల అంగంగా సౌష్టవంతోపాటు, వారు ధరించే వస్త్ర ధారణ కూడా కారణమేనని విశ్లేషకులు గతంలో వ్యాఖ్యానించారు. అందం ఉన్నది అనుభవించడానికే అన్నట్లుగా ప్రవర్తించే వెస్ట్రన్‌ పౌరులు తాజాగా సెక్స్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదట.

అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే
ప్రపంచంలోని అభివృద్దిచెందిన దేశాలైన అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య అంతగా తేడా ఉండటంలేదు. వారి మధ్య స్నేహంలో స్వచ్చత కాస్త ఎక్కువగానే ఉంటోంది. టీనేజ్‌ వచ్చే వరకు వారిలో స్నేహాలు, పేరెంట్స్‌ వత్తిళ్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక టీనేజ్‌ అంటే 5 వ తరగతినుంచే వారిలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఇక్కడ అమలుజరుగుతోంది. వారిలో సెక్స్‌ వల్ల కలిగే అనర్దాలు, చిన్న వయసులో పిల్లలను కనడంవల్ల జరిగే నష్టాలపై తరగతుల్లో భోధించడమేకాదు, కొత్త తరహాలో వారికి ప్రాక్టికల్‌గా అర్దమయ్యేలా 8వ తరగితినుండి పిల్లలకు ఆడా, మగా తేడా లేకుండా అప్పుడే పుట్టిన సైజులో ఉన్న బొమ్మలను వారికి ఇచ్చి వారిని అన్ని విధాలుగా కేర్‌ తీసుకోవాలని క్లాసులు నిర్వహిస్తున్నారు.

అందులో టైం ఫీడ్‌ చేసి పాలు పట్టడం, డైపర్స్‌ మార్చడం, పడుకోబెట్టడం వ ంటి పనులను పిల్లలతో చేయించడంతో వారికి కష్టసుఖాలు తెలిసివస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక వీరివయసు 18 దాటితే వీరిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అజమాయిషీ లేకుండా స్వాతంత్య్రం రాజ్యాంగమే కల్పిస్తోంది. దీంతో వారు ఏమి చేసినా చెల్లుబాటు అవుతోంది. అయితే వీరికి అంతకుముందే టీనేజ్‌ పేరెంట్స్‌పై ప్రాక్టికల్‌ పాఠాలు భోధించడంతో వీరు కొంతమేర పరివర్తనతో వ్యవహరిస్తున్నారని తాజా ఘణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవలీ కాలంలో భారీగా టీనేజ్‌ గర్బాలు తగ్గుముఖం పట్టాయని అబివృద్ది చెందిన దేశాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీరు స్నేహంలో మాత్రం టీనేజ్‌ దాటాక అబ్బాయి, అమ్మాయితో....అమ్మాయి, అబ్బాయితో తప్ప ఇద్దరు ఒకే జెండర్‌ కలిసి స్నేహం చేయడం కలలోకూడా కన్పించదట.

కొసమెరుపు
గుప్పెట మూసిఉంటేనే ఇబ్బందంతా అని భావించిన కొన్ని దేశాలు వాటిని ఓపెన్‌ చేయించేపనిలో పడ్డాయి. సెక్స్‌ను అందించేందుకు థాయ్‌లాండ్‌ ఇప్పటికే వ్యభిచారాన్ని చట్టబద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అదే దారిలో యువతకు ఉపాధి అవకాశాలంటూ స్పెయిన్‌ ఏకంగా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో వ్యభిచారంపై ఒక కోర్సును ప్రవేశపెట్టింది.

Monday, May 7, 2012

పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు టివి చూడడం, అనాలోచిత చర్యలకు

పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. చిన్న వయస్సులో పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆ చిన్నారి భవిష్యత్‌ వైపు నడుస్తున్నట్లుగా ఊహిస్తారు. పలక, బలపం చేపడితే మాబిడ్డ ఉద్యోగస్తుడయ్యాడంత సంబర పడుతారు. పిల్లల్ని ఎవరైనా, ఏదేనా అంటే రక్షణగా నిలిచిపోరాడుతారు. తమను ఎలాంటి కష్టాలు లేని తీరాలకు తీసుకెళ్తారనుకుంటారు. కానీ పిల్లలు చేస్తున్నదేంటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మనాన్నలను, ఆత్మీయబంధాలను కాదనుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న కారణం, ఆవేశం ఆ కుటుంబాలను విషాదాల్లోకి నెడుతున్నాయి. మరి అంతగా ప్రేమించిన వారిని అఘాధంలోకి నెడితే వచ్చిందేంటి. ఉన్న వారికి కన్నీరు తప్పా.

అందుకే యువత ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాలి. ఏదో సాధించామనే తృప్తిపడాలి. కానీ అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటే సాధించిందేంటి బూడిద తప్పా. చదువుకున్న వారి కన్న అక్షరాలు దిద్దిన వారే మేలు అనేది పల్లెల్లో వినిపించే సామెత. కానీ ఇటీవల కాలంలో విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాన్ని ఉద్దరిస్తారని, తమకు అండగా నిలుస్తారనుకునే తల్లిదండ్రులకు నిరాశ మిగుల్చుతున్నారు.

తల్లిదండ్రులు ఇలా...
ఇళ్లల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా పరస్పర గౌరవాలతో మెలగాలి. పరుష పదాలతో దూషించడం, హింసించడం, అవమానించడం, దెబ్బలాడడం వంటి చర్యలు పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం గుర్తింపుకోవాలి. తల్లిదండ్రులపై అసంతృప్తికి లోనైన పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతి, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చెడ్డఅలవాట్లు వంటి కారణాల రీత్య పిల్లల్లో విపరీతమై ఆలోచనలు చోటుచేసుకుంటాయి. పిల్లల్లో స్నేహాలు, పాఠశాలల్లో వారి ప్రవర్తన, చదువు విషయాలు తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి.

స్నేహపూర్వకం...
15 సంవత్సరాలు దాటిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా వ్యవహరించాలి. వ్యక్తిత్వాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకునేలా ప్రవర్తించాలి. ఎదుటి వ్యక్తికి ఎంతటి గౌరవ మర్యాదలు ఇస్తారో, ఎదిగే పిల్లలకు కూడా ఇవ్వాలి. ఇంట్లో వారి ఉనికిని గుర్తించి వారి భాగస్వామ్యానికి స్వాగతించాలి. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు టివి చూడడం, అనాలోచిత చర్యలకు పాల్పడరాదు.

ఇలా గుర్తించవచ్చు...
మాదకద్రవ్యాలకు అలవాటు పడడం, గ్యాంగ్‌లతో తిరగడం, ఆయుధాలు ఉపయోగించడం, ఎప్పుడు దిగులుతో కుంగిపోవడం, తనను తాను ఎక్కువగా నింధించుకోవడం, ఆత్మహత్యాయత్నం చేయడం, చదువులో బాగా వెనుకబడి పోయి నేరాలకు పాల్పడడం వంటి సందర్భాలపై తల్లిదండ్రులు పర్వేక్షిస్తూ పరిస్థితి విషమిస్తే వైద్యులను సంప్రదించాలి. పిల్లలు దీర్ఘకాలం మౌనం ఉండడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా, స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉండడం, ఆహారపు అలవాట్లకు అలసత్వం ప్రదర్శించడం వంటి లక్ష్యణాలు ఉంటే వైద్యపరీక్షలు చేయించాలి. తిరుగుబాటుకు దారితీసే నిబంధనలు పెట్టరాదు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు లేకుండా చూడాలి. అతిసంరక్షణ ప్రమాదం అన్న విషయం గుర్తించుకోవాలి. సమస్య వస్తే కుటుంబంలోని సభ్యులంతా కలిసి చర్చించి నిర్ణయించుకోవాలి. తప్పు చేసినప్పుడు సున్నితంగా దండించడం, మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటుండాలి.

పిల్లలు మరీ మీరు...
విద్యార్థులు కూడా ప్రతి చిన్న విషయాన్ని క్షణికావేశంలో ఏకంగా ప్రాణాలను తీసుకోవడం అనేది సరైంది కాదు. మీకు ఉన్న సమస్యను తల్లిదండ్రులకు, స్నేహితులకు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. చావు ఒక్కటే కాదు. జీవితంలో ఎన్నో సాధించినా ప్రత్యేక గుర్తింపు సాధించాలి. కానీ జీవితాన్ని అర్థాంతరంగా ముగించరాదు. మీరు ఎంచుకున్న విషయాన్ని స్పష్టంగా తల్లిదండ్రులకు వివరించాలి. మీకు ఉన్న ఆశక్తిని తల్లిదండ్రులకు వివరించి, వారిని ఒప్పించి నచ్చిన పని చేయండి.

చాట్ల హేమలత ఉద్యో గం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు..

నెల్లూరు: సమస్యలు చెప్పుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులను తిడితే ఎలాగని పోలీసులను ఎస్పీ మందలించారు. సైదాపురం మండలం పొక్కెందుల గ్రామానికి చెందిన బారతమ్మ తన ఇంట్లో ఉన్న 12 సవర్ల బంగారు నగలు అదే గ్రామానికి చెందిన చెఱుకూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చోరీ చేశాడని సైదాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఏమి పట్టించుకోకుండా బాధితురాలిని బూతులు తిట్టి పోలీసు స్టేషన్‌కు రావద్దని ఆగ్రహించాడు. ఈ విషయంపై సోమవారంగ్రీవెన్స్‌డే సందర్భంగా బాధిత మహిళ ఎస్పీ బీవీ రమణకుమార్‌ను కలసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకుంది. దీంతో ఎస్పీ పైవిధంగా స్పందించారు.

నమ్మించి మోసం చేశారు. గ్రామం నుంచి ప్రతి రోజు నెల్లూరుకు వచ్చి చదువుకుంటున్నాను. చాకలివీధిలో ఇన్‌టర్‌నెట్ నడుపుతున్న హరి నాకు పరిచయమయ్యాడు. ఉద్యో గం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. నాకు న్యాయం చేయండి. - చాట్ల హేమలత, పల్లిపాడు నాపై దాడి చేశారు..
భర్తతో కలసి పొగతోటలోని ఓ వైద్యశాలకు వచ్చా. పాత కక్షలు మనసులో పెట్టుకుని మరిది, మామ షరీఫ్, మరిది భార్య మరి కొంతమంది కలసి రోడ్డుపై నన్ను కొట్టారు. న్యాయం చేయండి. - రుబేదా, మన్‌సూర్‌నగర్
అశ్లీల పోస్టర్లను తొలగించండి.. నగరంలో పలుచోట్ల గోడలు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై అశ్లీకరంగా ఉండే బొమ్మలు వేసుకుని తిరుగుతున్నారు. వీటి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిని తొలగించండి. - ముస్లిం పెద్దలు, నెల్లూరు

మద్యం సేవించి భార్యను మానసికంగా , శారీరకంగా ..

నెల్లూరు : భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. నాల్గవ నగర ఎస్ఐ మల్లికార్జున కథనం ప్రకారం... సర్వేపల్లి కాలువ గట్టుపై నివాసం ఉంటున్న శీనివాసులు బేల్దారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. భార్య ప్రశాంతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రతి రోజు శీనివాసులు రాత్రి పూట మద్యం సేవించి భార్యను మానసికంగా , శారీరకంగా హింసించేవాడు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించిన శీనివాసులును ప్రశాంతి మందలించింది. దీనితో ఘర్షణ పడి ప్రశాంతిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన ప్రశాంతి ఇంట్లో ఉన్న గుళికల మందు తాగింది.స్థానికులు 108 కి సమాచారం అందించారు. ప్రశాంతిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబందం మానుకోవాలని హెచ్చరించడంతో శ్రీవల్లి ...

కోట: తమ కుమారుడితో అక్రమ సంబందం మానుకోవాలని హెచ్చరించడంతో శ్రీవల్లి (25) అనే గిరిజన వివాహిత సోమవారం తెల్లవారు జామున బావి లో దూకి మరణించింది. స్థానికులు, కుటుంభ సభ్యుల సమ చారం మేరకు. గూడలి పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీకి చెందిన శ్రీవల్లి సమీ ప ప్రాంతానికి చెందిన శ్రీనివాసులరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతడి కుటుంభ సభ్యులు వేధించరడంతో మృతి చెందింది. శ్రీవల్లి సోమవారం తెల్లవారు కాళ్లకు గుడ్డలు కట్టుకుని సమీపంలోని నేలబావిలో బావిలో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను బయటకు తీసేలోపే ఆమె మృతి చెందిం

Thursday, May 3, 2012

గ్రామం నుంచి బయటకు రావడంలేదు.. ఆరుగంటలైతే తలుపుల మూత..


గ్రామం నుంచి బయటకు రావడంలేదు
ఆరుగంటలైతే తలుపుల మూత
అవి అపోహలు: డాక్టర్‌ దత్తాత్రేయులు
మనుబోలు: హైటెక్‌ యుగంలోనూ దెయ్యం భయం జనాన్ని వీడడంలేదు. పుకార్లతో ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని బండేపల్లి గ్రామస్తులను దెయ్యం భయం వెంటాడుతోంది. గ్రామంలో 180 కుటుంబాలున్నాయి. 700 జనాభా ఉంది. మార్చి నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో వివిధ కారణాలతో ఆరుగురు హఠాత్తుగా మృతిచెందారు. వారిని ఓ శక్తి మింగేసిందనే పుకార్లు వచ్చాయి. కొందరు తమకు దెయ్యం కనిపించిందని ప్రచారం కూడా చేశారు. దీంతో ప్రజలు గ్రామం నుండి బయటకు రావడం మానుకున్నారు. సాయంత్రం ఆరుగంటలైతే అన్ని పనులు చేసుకొని తలుపులు మూసుకొని ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ గ్రామాన్ని సందర్శించింది. ఆరుగురు ఏ కారణాలతో చనిపోయారనే వివరాలను సేకరించింది. మార్చిలో శివనాయుడు అనారోగ్యంతోనూ, పద్మమ్మ గుండెపోటుతోనూ, మరో వృద్ధురాలు వయోభారంతోనూ మృతిచెందారు. ఏప్రిల్లో నాగమణి, రాజగోపాల్‌, ప్రతాప్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే వారిని దెయ్యం మింగేసిందని ప్రచారం జరగడంతో గ్రామం నుండి ఎవరూ బయటకు రావడంలేదు. తెల్లచీర కట్టుకున్న ఓ యువతి రక్తం తాగుతానని అంటోందని పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇకనైనా జెవివి వంటి సంస్థలు ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో నెలకొన్న భయాందోళనలు తొలిగించాల్సి ఉంది.
అవి అపోహలు: జెవివి
గ్రామంలో దెయ్యం తిరగడం, శక్తి ఉందని అనడం వట్టి మూఢ నమ్మాకాలనీ, అపోహలని జెవివి జిల్లా నాయకులు, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల డాక్టర్‌ దత్తాత్రేయులు అన్నారు. బండేపల్లిలో గ్రామంలో దెయ్యం తిరుగుతుందనే విషయమై ప్రజాశక్తి ఆయన్ను ఫోన్లో వివరణ కోరగా పై విధంగా స్పందించారు. ఎవరో స్వార్థం కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. దెయ్యాలు లేవని తాము శాస్త్రీయంగా నిరూపిస్తామని తెలిపారు. తాము నేరుగా ఆ గ్రామానికెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.

మహిళలైతే పైట కొంగులను నెత్తిపై వేసుకుని కాస్తై..

నెల్లూరుభానుడు విశ్వరూపం చూపాడు.. ప్రజానీకం విలవిల లాడారు..ఈ వేసవి సీజన్‌లో అత్యధికంగా గురువారం 42.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది. ఉదయం 8 గంటల నుంచే వేసవి ప్రతాపం తీవ్రం కావడంతో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. వేసవి తాపానికి తట్టుకోలేక పలువురు ఇళ్లకే పరిమితమయ్యారు. 

ఎండలోనే పనులు చేయాల్సిన కార్మికుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రజానీకం నానాతంటాలు పడ్డారు. మహిళలైతే పైట కొంగులను నెత్తిపై వేసుకుని కాస్తై వేసవి తాపాన్ని నివారించుకునే ప్రయత్నం చేశారు. నీడనిచ్చే వస్తువు ఏది చేతిలో ఉన్నా దానిని అడ్డంగా పెట్టుకుని ఎండ నుంచి సేద తీరారు. 

నెల్లూరు నగరంలో ఉదయం 12.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొబ్బరి బొండాంలు, మజ్జిగకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎండవేడిమితో గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. ఉపాధి పనులు జరగడం కనాకష్టంగా మారింది. ఈ పరిస్థితి రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Wednesday, May 2, 2012

ఏంమాట్లాడుతున్నావ్‌నువ్వు... పెద్దమగాడిలా... అంటూ రెచ్చి..

జలదంకి : ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చా రు. ఈ సందర్భంగా వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. జమ్మపాలెంలో జరిగిన ప్రచారంలో మహిళలు ఖాళీబిందెలతో వారికి నిరసన తెలిపారు. మీరు ఎంపీ, ఎమ్మెల్యేలు అయిన తరువాత మూడేళ్లకాలంలో ఒక్కసారికూడా తమ గ్రామానికి రాలేదని, గ్రామసమస్యలు పరిష్కరించలేదని అడ్డుకున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇంకా పలు గ్రామ సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఓ దశలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమస్యలపై ప్రశ్నిస్తున్న ఓ యువకుడిపై ఆగ్రహించారు. ఏంమాట్లాడుతున్నావ్‌నువ్వు... పెద్దమగాడిలా... అంటూ రెచ్చిపోయారు. 

స్థానిక నేతలు కలుగచేసుకుని సముదాయించారు. అనంతరం రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మీసమస్యలపై స్పందించని విషయం వాస్తవమేనని అంగీకరించారు. మీగ్రామంలో మంచినీటిసమస్య ఉందనే విషయమే తమకుతెలియదని, మేం ప్రజాప్రతినిధులులగా తిరిగి ఎన్నికైన తరువాత ఖచ్ఛితంగా మీసమస్యలు తప్పకతీరుస్తామని హామీఇచ్చారు. అనంతరం మండలంలోని లింగరాజుఅగ్రహారం, కేశవరం, చోడవరం, గట్టుపల్లి పంచాయతీలలో వారు ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా స్థానికులు పలు సమస్యలపై వీరిని ప్రశ్నించారు. జలదంకి మండలంలో నాలుగురోజులపాటు జరిగే ప్రచారంలో మొదటిరోజే మేకపాటి సోదరులకు చుక్కెదురైంది.

ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి

నెల్లూరు : పొలాలు, ఆహ్లాదకరమైన, రమణీయమైన ప్రకృతి కనువిందు చేసేది. కాని నేడు నగరం నుంచి 10-15 కిలోమీటర్ల వరకు ఏ వైపుకు వెళ్లినా ప్లాట్లు తప్ప పచ్చటి పొలాలు కనుమరుగైపోయాయి. రైతులకు డబ్బు ఆశ చూపించి వారి వద్ద వున్న పొలాలను ఎకరాలలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా వేసి భూబకాసురులు ఎక్కువ రేట్లకు అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక వేళ వారి వ్యాపారానికి ఈ భూమి సరిపోకుంటే పంచాయతీల భూములను సైతం కబ్జాలు చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు తెలియకుండా సంబంధిత అధికారులతో లాలూచిపడి తమ పనులు చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం నగరంలో స్థలం రేట్లు, ఇళ్ల రేట్లు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ భూబకాసురులే. గ్రామాల్లో కొన్ని చోట్ల పంచాయతీ స్థలాలను ఆక్రమించుకుని వాటిని కూడా ప్లాట్ల రూపంలో మళ్లించేస్తున్నారు. వీరికి ఎక్కడి భూమి కూడా సరిపోదన్నట్టు పేదల భూములను సైతం ఆక్రమించుకుంటున్నారు. గతంలో గ్రామం అంటే పచ్చటి పొలాలు, కోకిల గానాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఆహ్లాదకరంగా ఉండేది. కాని నేడు ఎటు చూచినా రియల్‌ ఎస్టేట్‌...రియల్‌ ఎస్టేట్‌. దీంతో ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి గురవుతున్నారు. హరనాధపురం నుంచి ముత్తుకూరు వరకు వేస్తున్న 4 లైన్ల రహదారి వలన కూడా ఈ రియల్టర్లే ఎక్కువ ఆదాయాలు గడిస్తారని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. 

నెల్లూరు రూరల్‌ మండలమైన ఇరగాళమ్మ దేవస్థానం నుంచి జొన్నవాడ, బుచ్చి మార్గంలో గతంలో ప్రయాణించాలంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఆ మార్గం పొడవునా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని పచ్చటి పొలాల రమణీయ, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించి వెళ్లేవారు. కాలానుగుణంగా ఆ ప్రాంతం మొత్తం ప్లాట్ల రూపంలో మారిపోవడం చాలా విడ్డూరంగా, బాధాకరంగా కనపడుతోంది. రైతులు తాము ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులపాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటున్న తరుణంలో... ఆ పొలాలను తాము కొంటామని ముందుకు వచ్చిన భూబకాసురుల మాటలకు లొంగిపోయి, తమ అప్పులు తీరుతాయని, తమ కష్టాలు గ ట్టెక్కుతాయని భావించి ఆ రైతులు తమ పొలాలను అమ్ముకుంటున్నారు. రైతులకు ఏర్పడిన ఇటువంటి దీనస్థితికి ప్రభుత్వాలే కారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సామాన్యులు ఎవ్వరూ ఇల్లు ట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో ఎటుచూచినా హద్దురాళ్లే కనపడతాయి. రైతులు పంటలు పండించే భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారిపోతే ధాన్యం లేక ఆహార కొరత తీవ్రతరమవుతుంది. అందరి వద్ద డబ్బులున్నా కొనేందుకు ధాన్యం దొరకదు.... తినేందుకు తిండి దొరకదు. ధనదాహంతో భూబకాసురులు సృష్టించిన ఈ కరువులో సమాజంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఊహించేందుకే భయమేస్తోంది.

Tuesday, May 1, 2012

అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు . డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా..


చిల్లకూరు : మండలంలోని తమ్మిన పట్నం గ్రామంలో మీనాక్షి ఎనర్జి ప్రయివేట్‌ లిమిటెడ్‌లో పని చేస్తోన్న వి సన్యాసిరావు, మరియమ్మల కుమార్తె అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు మంగళవారం అదనపు ఎస్‌పి చంద్రశేఖర్‌, గూడూరు డిఎస్‌పి సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలించారు. గ్రామస్తులను ఆయన విచారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంపెనీలో స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించినందున వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో హంతకుడిని పట్టుకుంటామని తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కొన్ని ఆధారాలు లభించినట్లు గూడూరు డిఎస్‌పి తెలిపారు.

పల్లకిలో ఉత్సవమూర్తులను బోయలు మోస్తూ ఆరు కిలోమీటర్ల దూరంలోని పెంచలకోనకు కాలినడకన

రాపూరు : పెంచలకోన బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలకమండలి, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. పూల తోటలోని ప్రత్యేక మండపంలో అలయ అర్చకులు పుట్టమట్టి తీసుకొచ్చి నవధాన్యాలతో కలశస్థాపనతో ఉత్సవాలకు అంకుర్పారణ చేశారు. యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం ఆలయంలో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. 'కోన'కు చేరిన ఉత్సవ మూర్తులు గోనుపల్లి ఆలయం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా మంగళవారం పెంచలకోనకు తీసుకొచ్చారు. తొలుత గోనుపల్లి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రతే ్యక పూజలు చేశారు. పల్లకిలో ఉత్సవమూర్తులను బోయలు మోస్తూ ఆరు కిలోమీటర్ల దూరంలోని పెంచలకోనకు కాలినడకన తీసుకురావడం విశేషం. ఉత్సవమూర్తులకు గొల్లబోయి ఆలయం వద్ద విశేష పూజలు చేశారు. అనంతరం గోనుపల్లిలోని గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. శ్రీవారిని తమ ఇంటి అల్లుడుగా భావించిన గిరిజనులు పుట్టతేనే, అటవీ దుంపలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను కోనకు తీసుకొళ్లి అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు జరిపించారు. ఉత్సవ మూర్తులు కోనకు చేరడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. విద్యుద్దీపాలంకరణ శ్రీవారు, ఆదిలక్ష్మి, ఆంజనేయాస్వామి వారి ఆలయాలు, కొండాకోనలను విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవుడు, దేవేరి ఆలయాల నడుమన ఉన్న పెద్ద కొండపై విద్యుద్దీపాలతో ఏర్పాటుచేసిన నామాలు, శంఖుచక్రాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. పెంచలకోనలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీవారికి ఉభయకర్తలు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శ్రీవారు, ఆంజనేయస్వామికి పూలాంగిసేవ నిర్వహిస్తారు. 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, 11.20 గంటలకు ధ్వజారోహణం, మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తి రుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి 10 గంటలకు శేషవాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. రాత్రికి భక్తులకోసం సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

Tuesday, April 24, 2012

తనతో సరిగా మాట్లాడని భర్త కొడుకుతో ఆడుకుంటుండడం చూసి ఓర్వలేక. కన్న కొడుకు గొంతునులిమి...

శరీరంలో విషం పెట్టుకున్న తేలు సైతం తన పిల్లల్ని వదలి వేటకు వెళ్లదు. ఒక వేళ ఆహారం కోసం వెళ్లాల్సి వస్తే పదుల సంఖ్యలో ఉన్న పిల్లల్ని వీపుమీద వేసుకుని వేటకు వెళుతుంది. పిల్లల్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఎంతటి బరువునైనా మోస్తుంది. ఒక విషపురుగుకు ఉన్న వివేకం మనిషికి లేకుండా పోతోంది. ఓ తల్లి తన నాలుగేళ్ల కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి గొంతు నులిమి కడతేర్చింది. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తే మనిషికన్నా విషపురుగులే నయం అనిపిస్తుంది. 


తడ : మండల పరిధిలోని వేనాడు పంచాయతీ మూల గ్రామంలో ఓ తల్లి మానసిక ఒత్తిడికి లోనై కన్న బిడ్డను గొంతునులిమి చంపిన సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ముతుకు శ్రీనివాసులు షార్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి భారతితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం భారతి సూళ్లూరుపేటలోని డేగావారి కండ్రిగలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు రాజీ చేసి నెల క్రితం భారతిని భర్తవద్ద వదలి వెళ్లారు. 

ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. తనతో సరిగా మాట్లాడని భర్త కొడుకుతో ఆడుకుంటుండడం చూసి ఓర్వలేక పోయింది. సోమవారం భర్త పనికి వెళ్లిన తరువాత కన్న కొడుకు భరత్(4) గొంతునులిమి చంపేసింది. ఆనోటా ఈ నోటా విషయం బయటకు పొక్కడంతో మంగళవారం పోలీసుల దృష్టికి వచ్చింది. సీఐ హనుమంతరావు, తడ ఎస్‌ఐ బీ. శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. భరత్ మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను కొడుకును చంపాలనుకోలేదని, గొంతు పట్టుకున్న వరకే తనకు తెలుసని తల్లి భారతి చెబుతోంది.

Sunday, April 22, 2012

సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని మాజీ మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు: మద్యం సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.

మద్యం సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ మాట్లాడితే బొత్సకు ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. బొత్స తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఇతర నేతలపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే సహించేది లేదన్నారు. సిండికేట్లపై ఎసిబి విచారణ వద్దన్న బొత్సకు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. అధికార పార్టీ అయి ఉండి కాంగ్రెసు ధర్నాలు, ఆందోళనలకు దిగడం సిగ్గు చేటు అన్నారు.

మద్యం సిండికేట్లకు మద్దతు పలుకుతున్న బొత్స సత్యనారాయణ అందుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల పైన కాకుండా బొత్స పెంచిన మద్యం ధరలు తగ్గించాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తే బాగుంటుందని సూచించారు.

అంతకుముందు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కూడా కాంగ్రెసుపై విరుచుకు పడ్డారు. విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశంకు ఎక్కడైనా ధర్నాలు నిర్వహించే స్వేచ్ఛ, ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఉందని చెప్పారు. విజయనగర సభకు అనుమతి అడిగామని, అయితే అనుమతి ఇవ్వకున్నా నిర్వహించి తీరుతామన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం ఎస్పీ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.

కాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెసు పార్టీ దుర్వినియోగం చేస్తోందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ దళితులను మోసం చేస్తోందని, దళితుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

బీర్‌ బాటిళ్లతో దాడి చేయగా ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర...

నెల్లూరు: నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు  నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు బీర్‌ బాటిళ్లతో కిరణ్‌పై దాడి చేయగా కిరణ్‌కు ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు . కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు

Wednesday, April 18, 2012

పిల్లలు లేనివారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు

నెల్లూరు : సమాజంలో కన్నతల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై అనాథలుగా వదిలేసిన పిల్లలను గుర్తించి వారిని ఆదరించాలని జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ బంగళాలో ఐసిబిఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు లేనివారికి దత్తత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తన కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణయ్య, దొరసానమ్మ దంపతులు అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకోవడం అభినందనీయ మన్నారు. వారు ఆ అనాథ బిడ్డను పోషించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. 

జిల్లాలో ఐదేళ్ల లోపు అనాథ పిల్లలను గుర్తించి వారిని శిశు గృహంలో చేర్పిస్తామని, పిల్లలు లేనివారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దత్తత స్వీకారం ఐసిడిఎస్‌ ద్వారానే జరుగుతుందని, ఎవరైనా పిల్లలు లేనివారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీరియల్‌ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటివరకు ఐదుగురు అనాథలను దత్తత ఇవ్వడం జరిగిందని, వారిలో ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలని తెలిపారు. 

Tuesday, April 17, 2012

ఉషారాణితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా..

lovers in nellore
నెల్లూరు: నెల్లూరు లో  ప్రేమించి పెళ్లిచేసుకున్నాం, తల్లిదండ్రులనుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట మంగళవారం రాత్రి ఎస్పీ బి.వి రమణకుమార్‌ను ఆశ్రయించింది. నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన శశికాంత్ కర్నూలులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉషారాణితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన ప్రేమికులిద్దరూ ఈనెల 11వ తేదీన ఇంట్లోనుంచి పారిపోయి ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని బిలీవర్స్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉషారాణి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుని శశికాంత్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరు జరిగిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ వారికి రక్షణ కల్పించాలని ఐదోనగర సెక్టార్ ఒన్ ఎస్సై శ్రీనివాసులరెడ్డిని ఆదేశించారు. ఎస్సై కేసు పరిశీలిస్తున్నారు.

స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు

నెల్లూరు : నెల్లూరు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కుసుమ హరిజనవాడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. గుడిపల్లిపాడుకు చెందిన కేటరింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు బత్తెన మల్లికార్జున మంగళవారం మధ్యాహ్నం వంటకాలను వాహనంలో పెట్టుకుని నగరంలోని హోటళ్లకు సరఫరా చేసేందుకు రోజూ మాదిరిగానే బయలుదేరాడు. వంటకాల వాహనంతో వస్తున్న మల్లికార్జునను నగర శివారు ప్రాంతమైన కుసుమహరిజనవాడ వద్దకు వచ్చేసరికే మణి, బాబు అనే ఇద్దరు వ్యక్తులు వాహనానికి అడ్డుగా వచ్చారు. వాహనాన్ని నిలిపిన మల్లికార్జునను డబ్బులు కావాలంటూ బెదిరించారు. వారిరువురూ మద్యం మత్తులో ఉండడంతో ఎందుకొచ్చిన బెడద అనుకుని మల్లికార్జున వారికి వంద రూపాయలను ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 

దీంతో వారు వంద ఇస్తావా అంటూ ఇంకా డబ్బులు కావాలని అతనిపై దాడి చేసి కొట్టసాగారు. స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు. ఇంతలో అటుగా వస్తున్న మఫ్టీ పోలీసులు విషయాన్ని గమనించి అక్కడకు వెళ్లి దాడిచేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిలో ఒకడు తప్పించుకుని పారిపోగా, మరొక వ్యక్తిని పోలీసులు పట్టుకుని రెండవ నగర పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండవ నగర ఎస్‌ఐ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి మరో నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు

Monday, April 16, 2012

ఆనం వివేకా యువకుని వలె కేరింతలు కొడుతూ అందరిని పలకరిస్తూ రిక్షా తొక్కడం..

నెల్లూరు : ప్రజాపథంలో భాగంగా నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు సోమవారం మధ్యాహ్నం మండుటెండలో గిరిజనులతోపాటు చెక్కరిక్షా ఎక్కి ర్యాలీలో పాల్గొనడం విశేషం. జడ్పీ స్కూల్‌ నుంచి చెక్క రిక్షాలో ర్యాలీగా నేతాజీనగర్‌ 8వ వీధికి చేరుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి పార్టీ నాయకులను ఎక్కించుకుని యువకుని వలె కేరింతలు కొడుతూ అందరిని పలకరిస్తూ రిక్షా తొక్కడం అందరినీ అబ్బురపరచింది. సేట్లు తలకు చుట్టే తలపాగా ధరించి పక్కన కార్యకర్తలతో చమత్కరిస్తూ ఎన్నికల ప్రచారం వలె ఆయన రిక్షా తొక్కుతూ వస్తుంటే కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది. 
అక్కడున్న విద్యార్థులను పలకరించి సమస్యలేవైనా ఉంటే చెప్పండి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 

ప్రతి ఒక్కరి వద్ద తన నెంబరు ఉండాలని, ఫోన్‌ చేస్తే స్పందిస్తానని, మీలో ఒక్కడినని వివేకా చెప్పారు. వివేకా రిక్షా తొక్కుతుండడంతో పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్‌ ఉండడంతో పరుగులు తీశారు. అలాగే అధికారులు ఎమ్మెల్యేలను అనుసరిస్తూ వచ్చారు.

Sunday, April 15, 2012

మద్యంకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం తల్లి,తండ్రి,సోదరిని...

వెంకటగిరి పట్టణంలోని తోలిమిట్టలో శనివారం రాత్రి అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన టీవెంకటేష్(18) కేసులో మృతుడి తండ్రి టి.రమణయ్యను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటేష్ మద్యంకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం తల్లి,తండ్రి,సోదరిని వేధిస్తుండేవాడు. 

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మద్యం మత్తులో వెంకటేష్ కుటుంబ సభ్యులతో తీవ్రస్థాయిలో గోడవకు దిగాడు. సహించలేని తండ్రి రమణయ్య కర్రతో వెంకటేష్‌ను కొట్టాడు. తలకు గాయం బలంగా తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం వెంకటగిరి సీఐ అబ్దుల్‌కరీం,ఎస్సై అన్వర్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రమణయ్యను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడి...

నెల్లూరు: గర్భిణిపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోని సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం మేరకు.. ముకుందాపురానికి చెందిన ఎన్. శ్రీనివాసులరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన హనుమంతరావుతో స్థల వివాదం ఉంది. ఈ విషయమై ఇరువురు కోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉన్న సమయంలో శనివారం హనుమంతరావు శ్రీనివాసులరెడ్డి స్థలంలోకి వెళ్లేందుకు యత్నించాడు.

శ్రీనివాసులరెడ్డి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన హ నుమంతరావు తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీనివాసులరెడ్డిపై దాడిచేశాడు. కళ్ల ఎదుట భర్తపై దాడిచేస్తుండడంతో సహించలేని సుహాసిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడిచేశారు. అడ్డొచ్చిన మరో ఇద్దరు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయమై బాధితులు రెండోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టించుకోలేదు. పెపైచ్చు ఎక్కువ మాట్లాడితే ఇరువర్గాలపై కేసులు కడుతామని హెచ్చరించారు.
బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి జరిగిన విషయాన్ని హాస్పిటల్ ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అప్పటికే సుహాసిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు మెరుగైన చికిత్స కోసం జూబ్లీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె జూబ్లీ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయింది. దాడిచేసిన వారు అధికారపార్టీ ఎంఎల్‌ఎ అనుచరులు కావడంతో పోలీసులు కేసునమోదు చేయడంలేదని బాధితులు ఆరోపించారు.బాధితులు తమకు జరిగిన నష్టం గురించి పోలీసులకు తెలిపినప్పటికి వారికి న్యాయం చేయకపోగా తాము చెప్పినట్లు వినకపోతే ఇరువర్గాలపై కేసులు పెడుతామని హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. రెండోనగర పోలీసులు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ బాధితులకు న్యాయం చేయడం లేదని, ఈ విషయమై తమ పార్టీ ఆధ్వర్యంలో డీజీపీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సౌజన్యతో ఫోన్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా...

నెల్లూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తల్లిదండ్రుల మాట విని తనను నిరాకరించడంతో ఓమహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆమె ప్రయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

నగరానికి చెందిన అరవింద్, హైదరాబాద్‌కు చెందిన సౌజన్యతో ఫోన్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో ఈనెల ఆరోతేదీ ఇంటి నుంచి పరారైన ఇద్దరు 8వ తేదీన భద్రాచలంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం నాలుగురోజులు అక్కడే గడిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరు నగరానికి చేరుకుని ఇంటికి వెళ్లారు. అరవింద్ కుటుంబసభ్యులు ఆమెను నిరాకరించారు. అరవింద్ సైతం తల్లిదండ్రుల మాటను విని ఆమెను వద్దన్నాడు. ఆమెను హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని సూచించారు. బాధితురాలు రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ప్రయాణికులు ఆమెను వారించి జరిగిన విషయం తెలుసుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అరవింద్ కుటుంబసభ్యులు ఇంటికి రావాలని సూచించారు. అరవింద్ అడ్డు తగల డంతో బాధితురాలు అతన్ని నిలదీసింది.అరవింద్ ఆమెపై చేయిచేసుకుని తనకు వ ద్దంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రయాణికుల సహాయంతో బాధితురాలు అ రవింద్‌పై రైల్వేపోలీసులకు ఫిర్యాదుచేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు రెలైక్కింది.

Thursday, April 12, 2012

కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.--మేకపాటి రాజమోన్‌రెడ్డి

నెల్లూరు; డక్కిలి ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఉండవని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోన్‌రెడ్డి అన్నారు. గురువారం డక్కిలి మండలం వెలికల్లులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ పథకాలు తిరిగి ప్రజలకు చేరువవుతాయన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో కనిపించే ఏకైక పార్టీ తమదే నన్నారు. కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ లకు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని మేకపాటి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపిీ నాయకుడు మచ్చాల నాగభూషణం తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కార్యక్రమంలో నాయకులు మేరిగ మురళీ, ఎ.వి రెడ్డి, పాల్గొన్నారు. వెంకటగిరిలో.. తిరుమల నుంచి వెంకటగిరి చేరుకొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి వెంకటగిరిలో ఆపార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక క్రాస్ రోడ్డులో ఆపార్టీ కార్యకర్తలు రాజమోహన్‌రెడ్డికి బాణా సంచా కాల్చి స్వాగతం పలికారు.

మే నెల 1 నుంచి పెంచలకోన లో వెలిసిన పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: రాపూరు మండలం పెంచలకోన లో వెలిసిన పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు  మే నెల 1 నుంచి ప్రారంభమయ్యే శ్రీ పెంచలస్వామి  బ్రహ్మోత్సవాలు  విజయవంతం చేయాలని ఆలయ పాలకమండలి చైర్మన్ నెల్లూరు రవ్రీంద్రారెడ్డి కోరారు. పెంచలకోనలో గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడతూ కోనలో ఆరు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ దీనికి ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. రోడ్లు మరమత్తులు చేయాలని, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అగ్నిమాపక కేంద్రం వారు ఉత్సవాల్లో వాహనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా అడవుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. కార్యక్రమంలో ఆయల పాలక మండలి అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బారీగా ఏర్పాట్లు ఈ ఏడాది జరిగే శ్రీవారి బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి గురువారం చైర్మన్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన సమీక్షలో నిర్ణయించారు. కోన క్షేత్రంలో మంచినీటి వసతి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. భక్తులకు పూర్తిస్తాయిలో సౌకర్యాలు ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించా

Wednesday, April 11, 2012

మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం రోజురోజుకూ...

నెల్లూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని పాలకులు తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య డిమాండు చేశారు. స్థానిక యుటిఎఫ్‌కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం రోజురోజుకూ తగ్గుతోందన్నారు. ఆ శాతం ప్రయివేటు పాఠశాలల్లో పెరుగుతోందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రాథమిక పాఠశాలలను జనవిజ్ఞాన వేదిక బృందం పరిశీలించి అధ్యయనం చేసిందన్నారు. అక్కడి పాఠశాలల వాతావరణం, ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్య తల్లిదండ్రుల్లో మంచి భరోసా కల్పిస్తున్నాయన్నారు. అందువల్లే ఆ రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు తమపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నాయని తెలిపారు. మనరాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతోనే ప్రయివేటు విద్యాలయాలపై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రయివేటు విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తుండడంతో ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల హాజరు, ఉత్తీర్ణతా శాతాలు తగ్గడంపై ప్రభుత్వం రకరకాల సర్వేలు, ప్రయోగాలు చేస్తుందేగాని అందుకు గల కారణాలను మాత్రం విశ్లేషించడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ప్రతి మండలంలో నాణ్యమైన విద్య బోధించే పాఠశాలలను ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ రంగ విద్యపై నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి తేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయక, మిల్లర్లు కారుచౌకగా అడుగుతుండడంతో రైతులు ధాన్యాన్ని పొలాలు, రోడ్ల వెంబడి ఆరబెట్టుకుని రేటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ సంక్షోభంపై జనవిజ్ఞాన వేదిక మే 2వ వారంలో చర్చావేదిక నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్‌కోతలు తీవ్రం కావడంతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి అవసరమైన 12500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నా అదనంగా 28,800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలను చేపట్టారని, అవి ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. ఆ ధర్మల్‌ కేంద్రాలన్నీ నెల్లూరు తీర ప్రాంతాన్ని కలుషితం చేయనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు..

నెల్లూరు : సునామీ భయంతో ముత్తుకూరు తీర ప్రాంతంలో బుధవారం రోజున అలజడి చెలరేగింది. మద్యాహ్నం నుంచి రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భీతావహులయ్యారు. ముఖ్యంగా తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కృష్ణపట్నం, నేలటూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది. సాయంత్రం సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని హుటాహుటిన బస్సుల్లో ముత్తుకూరుకు తరలించారు. బెర్తుల వద్ద లంగరు వేసిన నాలుగు నౌకలను వెంటనే సముద్రంలోకి పంపివేశారు.

ఎగుమతి, దిగుమతులను తాత్కాలికంగా నిలిపి వేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు తీరగ్రామాల్లో పర్యటించారు. నేలటూరు పట్టపుపాళెంలో మత్స్యకారులతో మాట్లాడారు. అవసరమైతే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తహసీల్దారు సుశీల తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సముద్రంలో అలల తాకిడి పెరిగింది. సముద్రం స్వల్పంగా ముందుకు వచ్చింది. సాయంత్రం ఆరు గంటల వరకు సునామీ భయంతో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 2006 డిసెంబరు నాటి సునామీ పరిస్థితులను గుర్తు తెచ్చుకొని భయపడ్డారు. అయితే రాత్రికి సునామీ ముప్పు తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సునామీ ప్రకంపనంతో భీతిల్లిన కోడూరు బీచ్ తోటపల్లిగూడూరు: సునామీ కారణంగా మండలంలోని కోడూరు బీచ్‌లో బుధవారం మధ్యాహ్నం పర్యాటకులు భీతిల్లారు. ఏ క్షణంలోనైనా సముద్రం ఉప్పొంగి ప్రమాదాన్ని సృష్టించవచ్చని భయబ్రాంతులతో సముద్రం సరిహద్దుకు చేరకుండా దూరంగానే ఉండిపోయారు. జాలర్లు తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రత ఎక్కువగా కనిపించింది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎస్ఐ సాంబశివరావు సముద్రతీరం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tuesday, April 10, 2012

వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా

నెల్లూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దిన దినాభి వృద్ధి చెందుతున్న దేవునివెల్లంపల్లి స్తం బాలగిరి ఆలయాన్ని ప్రభు త్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వెంకటగరి ఎ మ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభిప్రా య పడ్డారు.సోమవారం ఆయన తిరునాళ్ళకు హ జరై స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆలయానికి ఆనుకొనే స్తంబాలగిరి కోన ఉండటం, తిరునాళ్ళకు భక్తులు అధిక సం ఖ్యలో హజరుకావడం తదితర విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీ సుకొని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేం ద్రంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. వేసవిలో భక్తులు ఈ ఆలయానికి సమీపంలోని వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా విరాజిల్లుతు న్న ఈ ఆలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను ఆ యన ప్రశంసించారు. ఆలయానికి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంద ని తాను శాశ్వత మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయించానని ఆ యన వివరించారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh