online marketing

Thursday, February 2, 2012

పిల్లల్లో దృష్టిలోపంతోపాటు అంధత్వం కూడా

పెద్దల అవగాహన లోపం వలన సరైన సమయాల్లో చికిత్స చేయించకపోవడం వల్ల పిల్లల్లో దృష్టిలోపంతోపాటు అంధత్వం కూడా సంక్రమిస్తుందని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, మోడరన్‌ ఐ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధినేత డాక్టర్‌ పిఎల్‌.రావు తెలిపారు. ఆయన బుధవారం మేజర్‌న్యూస్‌తో మాట్లాడుతూ వస్తువుల మీద పడిన కాంతి ప్రతి వక్రీకరణ చెంది కంటి భాగాల ద్వారా ప్రసరించి రెటీనా అనే కంటి నరంపై పడి ప్రతిబింబం ఏర్పడుతుందన్నారు. కంటి నరం ద్వారా విద్యుత్‌ రసాయన చర్యచే మెదడు ఆ వస్తువు యొక్క రూపాన్ని గ్రహించగలుగుతుందన్నారు. కాంతి కిరణాలు వివిధ భాగాల ద్వారా (కార్నియా, లెన్స్‌, విట్రియస్‌) రెటీనాను చేరే ప్రక్రియలో ఎక్కడా అవరోధం ఏర్పడినా చూపు దెబ్బతింటుందని తెలిపారు. 
నల్లగుడ్డు, (కార్నియా) మచ్చలు ఏర్పడ్డ, గాయల వలన దెబ్బతిన్న కటకం (లెన్స్‌)లో పారదర్శకత లోపించి శుక్లం ఏర్పడ్డ లోపలి నరముల రెటీనా పాడైనా దృష్టి కోల్పోవడం జరుగుతుందన్నారు. వృత్తి రీత్యా ఎంత ప్రాధాన్యం వున్నా సున్నితమైన కంటిని రక్షించేందుకు ప్రకృతి ప్రసాదించిన కనురెప్పలు మాత్రమే అన్నారు. ఆఫ్తాల్మియా నియోనెటోరం అనే ఈ వ్యాధి అతి ప్రమాదకరమైందన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో, ఇళ్లలో జరిగే కాన్పుల్లో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుందన్నారు. తల్లి జననాంగాల అపరిశుభ్రత కూడా ఈ వ్యాధికి కారణమన్నారు. ఏడాది లోపు పిల్లల్లో కంటి పాప స్థానంలో తెల్లగాను, పసుపుగాను ఉండి మెరుస్తున్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా కంటి వైద్యులకు చూపించాలన్నారు. కంటిలో శుక్లం గాని రెటీనోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌ వ్యాధి వుండవచ్చని అభిప్రాయపడ్డారు.

దృష్టిలో లోపాలు ఉన్న పిల్లలు బోర్డు మీద రాసినవి కనపడక చదువుమీద శ్రద్ధ వున్నా తరగతిలో ముందుకు పోలేక అభద్రతా భావానికి లోనవుతున్నారని తెలిపారు. కంటి అద్దాలతో దృష్టి దోషాన్ని సరిచేస్తే వారి సమస్యలు అంతర్థానమవుతాయని తెలిపారు. హ్రస్వ దృష్టి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు రెటీనా వెనుక వైపు కాకుండా ముందు వైపు కేంద్రీకృతమవుతాయన్నారు. చిన్న పిల్లల్లో బాగా టివికి దగ్గరగా వెళ్తుంటారని, దీనిని తల్లిదండ్రులు దురలవాటుగా భావించి పిల్లలను మందలించిన సందర్భాలు ఎక్కువన్నారు. పిల్లల్లో తప్పనిసరిగా ఏడాదికొక్కసారి నేత్ర పరీక్షలు, దంత పరీక్షలు చేయించడం మంచిదని తెలిపారు. మెల్లకన్ను వున్నవారు అదృష్టవంతులనే వ్యాఖ్య సరికాదని, మెల్లకన్నుకు ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 1, 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు చికిత్స మెల్లకన్నుకు చేసినట్లయితే కంటిచూపు సక్రమంగా ఉంటుందన్నారు.

మెల్లకన్ను విషయంలో పిల్లలు పెరిగే కొద్దీ చికిత్స కష్టతరమవుతుందని తెలిపారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఆపరేషన్‌ ద్వారా మెల్ల కన్నును సరిచేయవచ్చుకాని తగిన చూపును మాత్రం తిరిగి పొందేటట్లు చేయడం సాధ్యం కాదన్నారు. పిల్లలకు కూసుగావున్న మొనలేని ఆట వస్తువులు పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల దరి చేరనీయకూడదన్నారు. పుల్లలతో, బాణాలతో కత్తి యుద్ధం లాంటి ఆటలాడుతూ కంటికి దెబ్బ తగిలించుకుని దృష్టి పోగొట్టుకునేవారు ఎక్కువ మంది వున్నారని తెలిపారు. కంటికి దెబ్బ తగిలినప్పుడు కంటిని నలపకుండా తెల్లని శుభ్రమైన రుమాలును (చేతిగుడ్డ) మడత వేసి కంటిపై వుంచి కంటి వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఆహారంలో విటమిన్‌ ఎ వల్ల లోపం ముందుగా కన్నులోని తడి ఆరిపోవడం, తెల్లగుడ్డుపై తెల్లని మచ్చలు త్రిభుజాకారంలో మెరుస్తున్న తెల్లని స్పాంజి లాంటి మచ్చలు, రేచీకటి వంటి వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. ఈ వ్యాధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తే శాశ్వత అంధత్వానికి గురి కావాల్సివస్తుందని తెలిపారు.

కంటిలోని జబ్బులకు, ఇతర కంటి వ్యాధులకు నాటు వైద్యాలు చేయడం ద్వారా శాశ్వతంగా గుడ్డివారు కావడం తప్పదని హెచ్చరించారు. నాటు వైద్యాల ద్వారా ఉన్న రోగం ఎక్కువై మొదటికే మోసం వచ్చే విషయాన్ని గమనించుకోవాలని ఆయన సూచించారు. ఏ వయసువారికైనా కంటి వైద్యం చేయడానికి అనువైన అధునాతన వసతులు, పరికరాలు, నిష్ణాతులైన వైద్య సేవలను అందించడమే మోడరన్‌ ఐ హాస్పిటల్‌ లక్ష్యమని డాక్టర్‌ పిఎల్‌.రావు తెలిపారు. 

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh