online marketing

Sunday, February 5, 2012

6కిలోమీటర్ల దూరానికే సుమారు 30కి పైగా మలుపులున్నాయి.

రాపూరు  : రాపూరు నుంచి పెంచలకోనకు వెళ్లే మార్గ ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా లెక్కలేనంత మంది గాయాలపాలైనా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ప్రమాదం జరిగినపుడు అధికారులు, నేతలు హామీలు ఇస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు. రాపూరు నుంచి కోనకు వెళ్లే మార్గం సుమారు 30కిలోమీటర్లు ఉంటుంది. గోనుపల్లి నుంచి కోన 6 కిలోమీటర్ల దూరం వుంటుంది. రాపూరు నుంచి గోనుపల్లి వరకు పలుచోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. గోనుపల్లి నుంచి కోన వరకు కేవలం 6కిలోమీటర్ల దూరానికే సుమారు 30కి పైగా మలుపులున్నాయి.

అటవీ ప్రాంతం కావడం, సింగిల్‌రోడ్డు ఉండడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు మార్గాన్ని కమ్మేస్తున్నాయి. ఇన్ని మలుపులు వున్నా ఒక్కచోట కూడా ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో కల్వర్టులు కూడా ప్రమాదకరంగా వున్నాయి. కొన్నిచోట్ల రోడ్డుకు సమాంతరంగా కల్వర్టులు వుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మ లుపుల వద్ద ఇరువైపులా సూచిక బో ర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh