నాయుడుపేట, మేజర్‌న్యూస్: జిల్లాలోని నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ1.49కోట్లు హడ్కో ద్వార నిధులు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శ్రీనివాసురాజు తెలిపారు. శనివారం నాయుడుపేట బాలికల గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి ప్రిన్సిపాళ్లు, అధికారులు సమీక్షసమావేశం జరిగింది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమబాట రెండ వ విడతలో భాగంగా రూ88లక్షల మౌలిక వసతులుగాను రూ60లక్షలు నిధులు మంజూరు చేశామని వీటి ద్వార పనులు30రోజులలో ముమ్మరంగా చేయునట్లు వివరించారు.
11 పాఠశాలలో మరుగుదొడ్లు, నీటివసతికి గాను రూ8.5లక్షలు విడుదల అయినట్లు వివరించారు. సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో ఇటీవల ఒక విద్యార్థి మృతి చెందడం పై విలేకరులు ప్రశ్నించగా దానిపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే పాఠశాలలో అర్హతలేని ఉపాధ్యాయులు నియమించడంపై ప్రశ్నించగా అలాంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు గురుకుల విద్యాలయ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ప్రిన్సిపాళ్లు పెంచల లక్ష్మీ, వాసు తదితరులున్నారు.
No comments:
Post a Comment