Friday, December 11, 2009
అర్హులందరికీ రుణాలుమాఫీ : డీసీసీబీ ఛైర్మన్
మహబూబ్‌నగర్‌టౌన్, మేజర్‌న్యూస్ : కేంద్ర ప్రభుత్వ రుణ విముక్తి పథ కం వర్తించే అర్హులైన రైతులకు రుణాలు మాఫీచేసే అవకాశం కల్పించి నట్లు డీసీసీ బ్యాంకు చైర్మన్ వీరారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రం లోని డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఈ అవకాశం డిసెంబర్ చివరి వరకు మాత్రమే ఉన్న ట్లు తెలిపారు. ఐదు ఎకరాలలోపు ఉండి 20వేల లోపు రుణం ఉన్న రైతు లకు పూర్తి మాఫీ చేయబడినట్లు తెలిపారు. ఐదు ఎకరాలకుపై బడి 20 వేల ఆదాయంపై రుణం ఉన్న రైతులకు ఆప్‌కాబ్ నుంచి 25 శాతం డీసీసీబీ నుంచి 25 శాతం మాఫీ వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కరవు జిల్లాగా ఎంపికచేయడంతో కరవు మాఫీగా 20వేలు ప్రభుత్వం నిర్ణయించగా ఆపై ఉన్న రుణాలకు తమ బ్యాంకు తరపున 25 శాతం మా ఫీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఒక రైతు 30వేల రుణం పొం దితే అందులో నుంచి కరవు మాఫీ క్రింద 20వేలు డీసీసీబీ నుంచి ఇచ్చే 25 శాతం మాఫీ పోగా కేవలం రైతు2,500 రూపాయలు మాత్రమే చెల్లి స్తే సరిపోతుందని వివరించారు. ముఖ్యంగా 80వేల లోపు రుణాలు పొందిన రైతులకు 50 నుంచి 100 శాతం మాఫీ వర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక లక్ష రూపాయలు రుణం పొం దిన రైతుకు 50వేలు మాఫీ కానున్నట్లు ఈ అవకాశాన్ని రైతులు సద్విని యోగపర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విముక్తి పథకం క్రింద మొత్తం 16,225 రైతులు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 51 కోట్లు రైతుల నుంచి వసూళ్లు చేస్తే 35 కోట్లు వచ్చేవని వీటిని తగ్గించడం వల్ల కేవలం 12.50కోట్లు మాత్రమే రైతుల నుంచి రికవరీ చేసేవీలుందని వివరించారు. ప్రస్తుతం 26 కోట్లు వసూళ్లు చేస్తే రాయితీ పూర్తిగా వర్తి స్తుందన్నారు. ఆర్థికంగా చితికిన రైతులకు ప్రభుత్వం చక్కటి రాయితీ అ వకాశం కల్పించినట్లు తెలిపారు. రుణ మాఫీ అయిన రైతులకు కూడా తి రిగి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, పంటరుణాలు చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు రాంమోహన్‌రావ్, బ్యాంక్ సీఇఓ. టిఎన్. మధుసూదన్ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment