online marketing

Sunday, May 8, 2011

మే 11 నుంచి నెల్లూరు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు


నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరాన గల నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ నుండి ప్రారంభం కానున్నాయి. మే 11వ తేదీన స్వామి వారికి అంకురార్పణతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.

మే 11, 2011 - అంకురార్పణ
మే 12, 2011 - స్వామివారికి ధ్వజారోహణ, చప్పర ఉత్సవం, రాత్రికి శేషవాహన సేవ
మే 13, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి హంసవాహనం
మే 14, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు
మే 15, 2011 - ఉదయం స్వామివారికి చప్పర ఉత్సవం, రాత్రి స్వామి వారికి హనుమంతసేవ
మే 16, 2011 - ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం అఖండజ్యోతి, తెల్లవారుజామున 3 గంటలకు బంగారు గరుడసేవ
మే 17, 2011 - సాయంత్రం స్వామివారి కల్యాణం, రాత్రి గజవాహనసేవ, పూలంగిసేవ
మే 18, 2011 - ఉదయం నరసింహపురం (కొండకు దిగువభాగం)లో స్వామివారి రథోత్సవం
మే 19, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి అశ్వవాహనం
మే 20, 2011 - ఏడు కోనేర్ల వద్ద చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ
మే 21, 2011 - రాత్రి స్వామివారికి ఏకాంతసేవ (బ్రహ్మోత్సవాలు ముగింపు)

స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కాలక్షేపార్థం ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16వ తేదీన "కురుక్షేత్రం" పూర్తినాటక ప్రదర్శన, తెల్లవారుజామున 3 గంటలకు "సత్యహరిశ్చంద్ర" కాటిసీను, 4 గంటలకు "రామాంజనేయ యుద్ధం" ప్రదర్శనలుంటాయి. అలాగే 17వ తేదీన రాత్రి 10 గంటలకు "గయోపాఖ్యాణం" యుద్ధసీను, "చింతామణి" భవాని సీను, అర్ధరాత్రి 12 గంటలకు "సత్యహరిశ్చంద్ర" పూర్తి నాటకాలు ప్రదర్శిస్తారు.

కామాక్షితాయి సన్నిధి:

నరసింహస్వామి కొండకు దిగువ భాగాన ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి సమేతంగా కామాక్షితాయి సన్నిది ఉంది. కోరిన వారికి కోటి వరాలిచ్చే కల్పవల్లి ఈ కామాక్షితాయి. పెన్నానదిని ఆనుకొని ఈ ఆలయం ఉంది. పవిత్రనదిలో స్నానమాచరించి, అమ్మవారిని దర్శించుకొని మనసారా నమస్కరించి కోరికలు కోరుకుంటే అమ్మవారు తప్పక నెరవేరుస్తారని వేలాది మంది భక్తుల నమ్మకం. లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన భక్తులందరూ తప్పకుండా కామాక్షి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తారు.
English summary
Sri Vedagiri Lakshmimarasimha Swamy Brahmothsavams starts from 11th May 2011 in Nellore District. This temple in its present form came into being nearly 500 years ago, on the summit of Narasimhakonda on the the bank of Pinakini (Penna River). This holy place lies 15 km away from Nellore Town, on the southern bank of the river Pinakini. Every year “Brahmotsavams” are celebrated here in the month of May.

1 comment:

  1. ఏప్రిల్ లో ఇక్కడకి వచ్చా నేను. జొన్నవాడ చూసుకుని కొండ ఎక్కాం. అపుడే వచ్చే నెల ఉత్సవాలు అని చెప్పారు. చిన్నపుడు ప్రతి సంవత్సరం ఇక్కడకి వచ్చే వాళ్ళం.

    ReplyDelete

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh