online marketing

Sunday, May 8, 2011

వైయస్ జగన్ మెజార్టీపై జోరుగా పందేలు: కడపలో రూ 40 కోట్లు

నెల్లూరు  : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల మెజార్టీ సాధిస్తారనే విషయంపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రెండో స్థానం ఎవరు దక్కించుకుంటారు, మైదుకూరులో మెజారిటీ డీఎల్‌కా? జగన్‌కా? పులివెందులలో గెలుపు విజయమ్మాదా, వివేకాదా తదితరాలపై బెట్టింగ్ రాయళ్లు భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. కోట్లు కురిపించే పందెంకోడి ప్రశ్నలు కూడా! ఓవైపు, గెలుపు కోసం కడపలో పార్టీలు కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటే వారిలో ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎంతంటూ రాష్ట్రవ్యాప్తంగా పందెంరాయుళ్లు కోట్లలో పందేలు కాస్తున్నారు. ఈసారి పందెం కాసిన వారిలో రాజకీయ నేతలు, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు ఉండడం గమనార్హం.

కడప జిల్లాలో ఇప్పటికే దాదాపు రూ.40 కోట్లమేర పందేలు జరిగాయని అంచనా. అలాగే, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పందేలు కాశారు. అక్కడ దాదాపు రూ.20 కోట్ల మేర ఉండవచ్చని తెలుస్తోంది. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ రాదని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి రూ.10 లక్షలు పందెం కాసినట్లు సమాచారం. గెలుపు, మెజార్టీతోపాటు 2, 3 స్థానాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని రెండో స్థానం ఆ పార్టీకే దక్కుతుందని జోరుగా పందేలు జరిగాయి. గెలుపు తథ్యమని, లేకపోతే రెండో స్థానం కాంగ్రెస్‌దేనని కూడా పందెం కాశారు. అనంతపురం జిల్లాలో జగన్‌కు వచ్చే మెజారిటీపైనే భారీ బెట్టింగ్ నడుస్తోంది.

లక్ష, రెండు లక్షలు, మూడు లక్షల మెజారిటీకి తగ్గదంటూ పలువురు బెట్టింగ్ కడుతున్నారు. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం తదితర పట్టణాల్లో జగన్ మెజారిటీపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లక్షకు పైగా, రెండు లక్షల్లోపు మెజారిటీ వస్తుందని పెద్ద సంఖ్యలో బెట్టింగ్ కడుతున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయలకు సంబంధించి బెట్టింగ్‌కు ఒప్పందాలు కుదిరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రెండు లక్షల పై చిలుకు మెజారిటీ తమ నేతకు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బెట్టింగ్‌లు కడుతుండగా, యాభై వేల నుంచి లక్షలోపు మెజారిటీ మాత్రమే వస్తుందని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బెట్టింగ్‌లు పెడుతున్నారు. జగన్ సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పందేల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతకు తగ్గితే రూ. వందకు రూ. రెండు వందలు ఇస్తామంటూ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనూ పందేల జోరు అధికంగా ఉంది. మెజార్టీ భారీగా తగ్గిపోతుందని కొందరు, పాత మెజార్టీ కంటే పెరిగి 2 లక్షల మెజార్టీ జగన్‌కు లభిస్తుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. 50 వేల మెజార్టీపై రూ.10 నుంచి 20 వేల వరకు పందేలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కంటే పందెపు రాయుళ్లలోనే టెన్షన్ అధికమైంది.

పరిచయమున్న పత్రికా ప్రతినిధులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది నుంచి ఏ రోజుకారోజు పరిస్థితిని తెలుసుకుంటూ అనుకూలంగా పందేలు కాస్తున్నారు. జగన్‌కు లక్ష నుంచి 2 లక్షల వరకు మెజార్టీ రాదని చెప్పేవారు రూపాయికి రెండు రూపాయిలు ఇచ్చే విధానంపై పందెం కాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పందేలు జరగడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరులో, జగన్‌కు పులివెందులలో, మైసూరారెడ్డికి కమలాపురంలో మెజార్టీ వస్తుందని పందేలు జరిగాయి. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతం, పోలింగ్ తీరు, రాజకీయ పక్షాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పందేలు మరింత జోరందుకోనున్నాయి.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh