online marketing

Sunday, May 8, 2011

ఓటేద్దాం పదండి! పరుగులు తీసిన కడప విద్యార్థులు, ఓటర్లుజగన్, విజయమ్మల గెలుపుపై ఎంపి, జడ్పీ చైర్మన్ ధీమా

నెల్లూరు: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడ నుండి వలస వచ్చిన జనం శనివారం రాత్రి కడపకు బయలు దేరి వెళ్లారు. కడప నుండి వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వేలల్లో ఉన్నట్లు అంచనా. వీరంతా శనివారం మెస్ భోజనాలు ముగించి బస్సుల్లో వివిధ వాహనాల్లో కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. విద్యా సంస్థల యాజమాన్యం వారిస్తున్నా విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలనే పట్టుదలతో వెళ్లినట్లు వారికి బయట భోజన సౌకర్యం కల్పిస్తున్న మెస్ యజమానులు తెలిపారు. అలా వెళ్లిన వారిలో 60 శాతం మంది జగన్, విజయమ్మల వైపు మొగ్గు చూపుతున్నట్లు మెస్ యజమానులు తెలిపారు. ఓటు లేని కొందరు విద్యార్థులు జగన్ విజయంలో పాలుపంచుకునే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు బుజబుజ నెల్లూరుకు చెందిన మల్లికార్జున టెలీలింక్ సర్వీసు యజమాని తెలిపారు. కడపలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి బ్యాగులు, సరంజామా వదిలేసి కేవలం కట్టుబట్టలతో ఓటేయడానికి బయలుదేరారని చెప్పారు. ఓటున్న విద్యార్థులంతా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంత మంది విద్యార్థులు కలిసి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. జగన్, విజయమ్మల విజయంతో ఢిల్లీలో రాష్ట్రం ప్రతిష్ఠ నిలబడుతుందని కడపకు చెందిన రంగారెడ్డి అనే విద్యార్థి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడాలనే తపనతోనే ఓటేయడానికి వెళుతున్నామని ఆ విద్యార్థి పేర్కొన్నాడు.
జగన్, విజయమ్మలకు భారీ మెజారిటీ
ఇదిలావుండగా కడప పార్లమెంటు నియోజకవర్గంలో జగన్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ భారీ మెజారిటీతో గెలుస్తారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలో జగన్, విజయమ్మల తరుపున 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన నేతలిద్దరూ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో జగన్‌కు రెండు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. అలాగే పులివెందులలో విజయమ్మ 30 వేల ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగిస్తారన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh