online marketing

Sunday, May 8, 2011

రాజకీయాలకు అతీతంగా నిధులు

నెల్లూరు ‌: రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఉంటూ నిధులు తీసుకొస్తూ నెల్లూరులో సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు తెలిపారు. శనివారం 35వ డివిజన్‌ పరిధిలోని పింఛన్‌ లైన్‌లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివేకా మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంను ప్రజలందరూ రెండు సార్లు ఆదరించబట్టే ఇన్ని నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. మీ ఆశీర్వాదం తమపై ఎల్లవేళలా ఉంటే ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా నగరాభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా అర్హులందరికీ పెన్షన్‌లు, ఇళ్లు, పావలా వడ్డీ అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.పథకాలు అర్హులైనవారికి అందిస్తున్నామే తప్ప వారిలో సిపిఎం, టిడిపి, బిజెపి, జగన్‌ పార్టీయా అని చూడడం లేదని ఆయన తెలిపారు. ఇన్ని పథకాలు రూపకల్పన చేసిందంటే కేంద్రము, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండబట్టేనని తెలిపారు. ఈ డివిజన్‌లో దాదాపు అన్ని రోడ్లను పిండి సురేష్‌ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు వేసినవే అన్నారు. ఇంకా ఏమైనా మిగిలివుంటే ఆ రోడ్లు కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు మాట్లాడుతూ గత ఐదేళ్లు కాంగ్రెస్‌ పార్టీ ఉండబట్టే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన కితాబిచ్చారు. రూ.102 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి, రూ.20 కోట్లతో వాటర్‌ ట్యాంకులు వస్తున్నాయని అన్నారు.

అలాగే ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండబట్టే మేము ఇరువురము నిధులను అడిగిన వెంటనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో నగరంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. లో ఓల్జేటి సమస్యను అధిగమించడానికి సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు, కొత్త కార్పొరేషన్‌ బిల్డింగు వంటివి వచ్చాయని తెలిపారు. ఈ పింఛను లైన్‌లో ఒక పక్క నగర నియోజకవర్గానికి, మరో పక్క రూరల్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని తెలిపారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మరిన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చాట్ల నరసింహ రావు, బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్‌, హరి, జశ్వంత్‌సింగ్‌, ఖయ్యూం, అరిగెల కోదండం, మురళీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రొయ్యలు, చేపల వ్యాపారులకు స్థలం కేటాయింపు
హరనాధపురం, రామలింగాపురం సెంటర్‌ రోడ్డు మార్జిన్‌లో రొయ్యలు, చేపల వ్యాపారం చేసుకుంటున్న వారికి కొత్త పెన్నా బ్రిడ్జి అవతల ఉన్న స్థలాన్ని వ్యాపారస్తులకు కేటాయించడం జరిగిందని శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు శనివారం తెలిపారు. వీరు కొత్త పెన్నా బ్రిడ్జి వద్ద హరనాధపురం రోడ్డు మార్జిన్‌లో చేపలు, రొయ్యలు వ్యాపారం చేసుకుంటున్న వారికి పెన్నా బ్రిడ్జి వద్ద కొంత స్థలాన్ని అప్పగించడం జరిగిందన్నారు. హరనాధపురంలో రోడ్డు వెడల్పు చేస్తున్నారని, వీలైనంత త్వరగా కొత్త పెన్నా బ్రిడ్జికి వచ్చేయాలని తెలిపారు. తాత్కాలికంగా వీరు రేకుల షెడ్డు వేసుకుంటే అనంతరం నిధులు తీసుకొచ్చి అక్కడ వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇక్కడ హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఇన్‌చార్జ్‌ చాట్ల నరసింహరావు, కాంగ్రెస్‌ నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సరోజనమ్మలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh