Wednesday, January 6, 2010
పులికాట్ పూడికతీత ఉత్తిదే-నేలపట్టులో బొటానికల్ గార్డన్...
సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్ : పులికాట్ సరస్సుని రామ్‌సైట్‌లో చేర్చి సరస్సు పూడికతీత చేస్తామని చెప్పిన నేతల మాటలు ఉత్తిగానే మిగిలిపోయాయి. సరస్సుని రామ్‌సర్ సైట్‌లో చేర్చలేదని, పులికాట్ పూడిక తీతకు సాంకేతిక అంశాలు అడ్డుగా ఉన్నాయని పులికాట్ సరస్సు ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ రితీష్ మల్హోత్రా తేల్చేచారు. పులికాట్ సరస్సుప్రాంతాన్ని మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరస్సును ఇంకా రామ్‌సర్‌సైట్‌లో చేర్చలేదని తేల్చేచారు. పులికాట్ పూడిక తీతకు కూడా సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రా, తమిళనాడు ప్రాంతంలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సుని అభివృద్ధి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకు రావాలని, అక్కడివారు సరస్సు అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత నివ్వడం లేదని తెలిపారు. పులికాట్ పూడిక తీత కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి కేంద్ర నిధులు విడుదలైతేనే సాధ్యమని చెప్పారు. పులికాట్ సమీపంలోని నేలపట్టుని అన్ని విధాలా అభివృద్ధి పరిచి బొటానికల్ గార్డన్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలిపారు. నూరు ఎకరాలలో పార్కుని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే రూ. 100 కోట్లు వెచ్చించి నేలపట్టుని అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలిపారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం టూరిజంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పరసారత్నం, ఫారెస్టు, వన్యప్రాణి విభాగం అధికారులు మురళీకృష్ణ, మల్లిఖార్జున, నర్సింహారావు, సుబ్బనాచారి, ఎ సింగ్, డివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment