Friday, January 8, 2010
నగరంలో భారీగా వాహనాల ర్యాలీ
నెల్లూరు, మేజర్‌న్యూస్: రహదారి భద్రతా వారోత్సవా ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం రవాణాశాఖ ఆధ్వర్యంలో భారీగా వాహనాల ర్యాలీ జరిగింది. ఈ నెల 1 నుంచి వారం రోజులపాటు ఈ రహదారి భద్రతా వారోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వాహన చోదకులు, పాదచారులు, విద్యార్థులు, ఇతరులు వాహనాలను జాగ్రత్తగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలను నడపకుండా ఉండడం, మితిమీరిన వేగం లేకుండా ఉండడం తదితర జాగ్రత్తలు, సలహాలు, సూచనలను కరపత్రాలు, ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు ద్వారా అధికారులు ప్రజలకు తెలియజే శారు.భద్రతా వారోత్సవాల ముగింపు రోజైన గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భక్తవత్సలనగర్‌లోని ఆర్టీఎ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వై.జయకుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో కార్లు, ఆటోలు, టెంపోలు, స్కూటర్‌లు, ఆర్టీసి బస్సులు, టాటా ఏస్, తదితర 180 వాహనాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీ ఆర్టీఎ కార్యాలయం నుంచి బయలుదేరి అయ్యప్పగుడి, వేదాయపాళెం, కొండాయపాళెం గేట్, ఆర్టీసి, విఆర్‌సిల మీదుగా గాంధీబొమ్మ వరకు సాగింది. ఈ ర్యాలీలో డిటిసి వై.జయకుమార్‌రెడ్డి, ఆర్టీఒ రాంప్రసాద్, మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లు కెజి.కృష్ణంరాజు, ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ఎఎన్‌విఐ గోపీనాయక్, ఆర్టీఎ కార్యాలయ ఎఒ కరీం, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment