Friday, January 8, 2010
అరుదైన హృద్రోగ శస్తచ్రికిత్స
నెల్లూరు రూర ల్,మేజర్‌న్యూస్:ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏ వైద్యశాలలో ఇప్పటి వరకు నిర్వహించని అరుదైన హృద్రోగ శస్తచ్రికిత్స తమ హాస్పిటల్‌లో నిర్వహించినట్లు నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో గల నారాయణ హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరుకు చెందిన రత్నమ్మ అనే 30 ఏళ్ల మహిళ హైపర్‌ట్రాఫిక్ ఆబ్ స్ట్రక్టివ్ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటళ్లలో చికిత్సకు ప్రయత్నించి చివరకు తమ వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు. ఈమెను పరీక్షించిన తమ హాస్పిటల్‌లోని హృద్రోగ వైద్యనిపుణులు డాక్టర్ భక్తవత్సలరెడ్డి, డాక్టర్ ఫణికృష్ణలు ఈమెకు గుండె కవాటం మూసుకుపోయినట్లుగా గుర్తించి, తొలుత సంబందిత కండరాలు వాపు తగ్గించే ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆల్కాహాల్ అబ్లేషన్ అనే శస్తచ్రికిత్స నిర్వహించి రోగిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేసినట్లు ఆయన పేర్కొన్నారు.అనంతరం హాస్పిటల్ సిఇఒ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ పేదరాలైన ఈ రోగి ఇదే శస్తచ్రికిత్స ఇతర హాస్పిటల్‌లో చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అయ్యేదని, కాని తమ హాస్పిటల్‌లోని అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా శస్తచ్రికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈమెకు ఆరోగ్యశ్రీ వర్తింపచేసినందువల్ల సంబంధిత రోగివద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుదైన శస్తచ్రికిత్సను అతి సునాయాసంగా, విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ భక్తవత్సలరెడ్డి, డాక్టర్ ఫణికృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment