Friday, January 8, 2010
బోగస్ కార్డుల ఏరివేత వేగవంతం చేయండి
నెల్లూరు, మేజర్‌న్యూస్: జిల్లాలో కొనసాగుతున్న బోగస్ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ బినామీ లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాలను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ సంజయ్‌జాజు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులతో బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న గ్రామసభల్లో మొదటి విడత సర్వేలో తమ కార్డులు రద్దు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ సరిగా నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదిదారుల వాదన సరైన పక్షంలో విచారణ జరిపి వారి కార్డులు రద్దు కాకుండా చూడాలన్నారు. అదే విధంగా రెండవ విడత పూర్తయిన సర్వేకు సంబంధించి ఈనెల 16వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే అమలవుతున్న తీరుతెన్నులనను అడిగి తెలుసుకొని, సర్వేలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్, డిఎస్‌ఓ జ్వాలాప్రకాష్, హౌసింగ్ డిఎం సత్యనారాయణ, ఎఫ్‌సిఐ అధికారులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment