Wednesday, January 6, 2010
గమ్యమెరుగని పాటల ప్రయాణం
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్: స్థిర నివాసం లేని నిరంతర పాటల శ్రామికుల పయనంలో మంగళవారం నగరంలో పలు కూడళ్లలో ఈ అంధులు ప్రజల్లో సంగీత వెలుగు రేఖలను రేకెత్తించారు. తమకు తామే మైకులు అమర్చుకుని కీబోర్డు, డోలక్‌లతో చక్కటి స్వరాలతో చుట్టూ చేరిన ప్రేక్షకులకు ఓ గొప్ప స్టార్ నైట్‌ను మించిన అనుభూతిని అందించారు. అంధత్వాన్ని అధిగమించి సాగుతున్న వారి సంగీత ప్రయాణంలో ప్రతి మలుపూ ఓ జీవిత పాఠాన్ని నే ర్పుతుందంటారు. మనో నేత్రంతో సృష్టిలోని అందాలను తిలకిస్తూ సంగీత సిరులను అందిస్తూ నేత్రాలున్నవారికి ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూ వీరు మాత్రం పాటలా సాగిపోతున్నారు. అభినందనల చప్పట్ల చప్పుళ్లతోపాటు ఆర్థికంగా ఆదుకోమంటూ జీవంలేని చెమ్మగిల్లిన కళ్లతో పాటల కందని గొప్ప సంకేతాన్ని మన కళ్లకు అందజేస్తున్నారు. ప్రజాదర ణే మమ్ములను నడిపిస్తుంది -- ప్రసాద్‌రైలు, బస్సులు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇక్కడ పాటలు పాడిన ప్రజలు అత్యంత ఆసక్తితో మమ్ములని ఆదరిస్తున్నారని అంధుల వీధి కచ్చేరీలకు నాయకత్వం వహిస్తూ కీబోర్డు వాయిద్యకారుడు ప్రసాద్ పేర్కొన్నాడు. చిన్నప్పుడు పిల్లలతో ఆటల కొట్లాటలతో కళ్లు పోయిన తనకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తి జీవితానికి ఆసరాగా మిగిలింది. అదే ఆసక్తి గలవారిని కలుపుకుని ఒక జట్టుగా ఏర్పడి ఊరూరా ప్రదర్శనలు ఇస్తున్నాము.ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి -- హేమలత, కృష్ణఅంధులు చదువుకున్న తమకు ఉద్యోగాలు రాలేదని, ఊరూరు తిరుగుతూ పాటలతో జీవనం గడుపుతున్నామని పుట్టుకతో గుడ్డివారైన కృష్ణ, హేమలత దంపతులు తెలిపారు. హేమలత ఇంటర్ వరకు, కృష్ణ డి గ్రీ డిస్కంటిన్యూ చే సి పాటలు పాడుతూ బతుకును వెళ్ల దీస్తున్నాడు.నివాస స్థలాలు ఇప్పించండి -- పాపమ్మ, ఉండడానికి ఇల్లు లేక ఊరూరా తిరిగి పాటలతో పొట్టపోసుకుంటున్న తమకు ప్రభుత్వాధికారులు ఉండడానికి స్థలం ఇవ్వాలని భర్తను పోగొట్టుకున్న అంధురాలు పాపమ్మ కంటతడి పెట్టుకుంది. అంధుల పాలిటి చుక్కాణి ‘కుమారి’ఈ అంధుల అందరిని నడిపించే చిన్నారి కుమారి. చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలను భుజాన వేసుకుని ఈ అంధులందరినీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడిపిస్తుంది. ఫలితంగా బడికి వెళ్లి చదవుకోలేకపోయింది. అయినా చూపులేని తల్లితోపాటు మరో నలుగురికి మార్గం చూపే బృహత్తర కార్యాన్ని నెరవేరుస్తున్నాననే స్థైర్యం ఈ చిన్నారి కళ్లలో తొణికిసలాడుతోంది.కళ్లున్న మనుషుల కంటే కళ్లు లేకపోయినా దేవుడిచ్చిన స్వరంతో అందరికీ ఆనందాన్ని నింపుతూ, వారి బాధలను లెక్క చేయకుండా సాగిపోతున్న ఈ అంధుల పాటల పయనం ఒక స్థిరనివాస గమ్యాన్ని చేరుకోవాలని ‘సూర్య’ ఆశిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment