Friday, January 8, 2010
స్పోర్ట్ సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నారు-చర్యలు తీసుకోండి
నెల్లూరు (స్పోర్ట్‌స) మేజర్‌న్యూస్: పలు క్రీడా సంఘాలు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయివరకు క్రీడా పత్రాలను అమ్ముకుంటున్నారని రైట్ టు ప్లే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వై.సుమన్ గురువారం నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్‌స కాంప్లెక్స్‌లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారికి ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విలువలను దిగజారుస్తూ జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి జిలానీబాషా విజయనగరం బాలుర ఖో-ఖో అకాడెమి టాప్ ర్యాంకర్ క్రీడాకారుడిని కె.శ్రీకాంత్ అనే పేరుతో 20వ సబ్‌జూనియర్ నేషనల్ ఖో-ఖో చాంపియన్‌షిప్- 2005-06 ఆడిపించి ఆ సర్టిఫికేట్‌ను శ్రీకాంత్ అనే విద్యార్థికి రూ.70 వేలకు అమ్ముకున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ 533ని శాఫ్ అధికారుల పరిశీలన నిమిత్తం అందజేశారు. జిల్లాలో క్రీడాసంఘాల్లో స్పోర్ట్‌స అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు క్రీడాసంఘాల్లో కీలకపాత్ర వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఇతర జిల్లాల క్రీడాకారులను జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించేటట్లు చేయడం ద్వారా డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసోసియేషన్ సభ్యుల అండదండలతో అక్రమంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల వివరాలను ఆయన తెలిపారు. జాతీయ జూనియర్ సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ పోటీల్లో నేరుగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అలానే అసోసియేషన్ నిర్వహణా కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పిల్లలు, బంధువుల పిల్లలు ఎంపికల్లో పాల్గొనకుండానే నేరుగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడినట్లు సర్టిఫికేట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విధమైన అనేక అక్రమాలకు సంబంధించిన విషయాలపై విచారణ జరపాలని ఆయన డిఎస్‌డిఒను కోరారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటా : డిఎస్‌డిఒ సర్టిఫికేట్ల అమ్మకాలు గురించి సంబంధిత అసోసియేషన్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోడానికి అధికారులతో సంప్రదిస్తామని డిఎస్‌డిఒ జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment