Monday, January 11, 2010
ప్రభుత్వ సొమ్ము నిరూపయోగం
ఆత్మకూరు, (మేజర్‌న్యూస్): ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకానికి లక్షల రూపాయలు నిధులు మంజూరవుతుంటే స్థానిక అధికారుల అలసత్వంతో మొక్కల పెంపకం నామమాత్రంగా జరుగుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు అటవీ శాఖ పరిధిలో ఇరిగేషన్ నివాసాల వద్ద రెండేళ్ల క్రితం ఓ నర్సరీని ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మొక్కల పెంపకానికి అవసరమైన ట్రేలు, క్లోన్‌లు విరివిగా సరఫరా చేశారు. మొక్కలకు అవసరమైన నీటి వసతి కల్పించారు. ఇక్కడ పెంచిన మొక్కలను ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, ఏఎస్‌పేట మండలాలకు వినియోగించుకోవాల్సి ఉంది. ప్రభుత్వపరంగా ఎవరు మొక్కలు నాటే కార్యక్రమానికి సమాయత్తమైతే వారికి తక్కువ రేట్లతో అటవీశాఖాధికారులు అవసరమైన మొక్కలను అందిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ భారీ లక్ష్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రారంభించిన నర్సరీని నాలుగు నెలలుగా గాలికొదిలేశారు.అక్కడ పెంపకానికి అవసరమైన విలువైన క్లోన్లు, ట్రేలు నిరూపయోగమవుతున్నాయి. ఎంతో లక్ష్యంతో ఏర్పాటు చేసిన నర్సరీ నామమాత్రంగా కనిపిస్తుంది. ఓ వైపు మొక్కల పెంపకానికి జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా నిధులు మంజూరు చేస్తుంటే రైతులకు అవసరమైన మొక్కల పెంపకం కంటికి కనిపించడం లేదు. ఎందరో రైతులు మొక్కల కోసం వస్తే నర్సరీని చూసి నవ్వుకుంటూ వెళుతున్నారు. ఇదేమని అక్కడ అడిగితే జవాబు చెప్పేవారు కనిపించరు. సంబంధిత అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం కాస్తా నీరుగారుతుంది. ప్రతి ఏటా మొక్కల పెంపకం జరగాల్సి ఉండగా నామమాత్రంగా మొక్కలు పెంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వనసంరక్షణ విభాగంలో మొక్కల పెంపకం విరివిగా కొనసాగుతుంది. మరి ఇలాంటప్పుడు అవసరమైన మొక్కలు కనిపించకుండా నర్సరీని గాలికి ఎలా వదిలేశారో ఆ అధికారులకే తెలియాల్సి ఉంది. కానుగ, నేరేడు, వేప, మద్ది, ఉసిరి, టేకు మొక్కలు పెంచేందుకు నర్సరీ ఉండగా నేడు ఆ నర్సరీని చూస్తే అధికారుల పనితీరు ఇదా... అనిపిస్తుంది.
ఫ్రిబవరి నుంచి పనులు ప్రారంభం: రేంజర్‌ఆత్మకూరు నర్సరీ సక్రమంగా పని చేస్తుందని ప్రతి ఏటా నిధులు వస్తే మొక్కలు పెంచుతున్నామని అటవీశాఖ రేంజర్ ఎన్.శేషయ్య ‘మేజర్‌న్యూస్’కు వివరించారు. ఫ్రిబవరిలో నిధులు మంజూరు కానున్నాయని, అవి వచ్చిన మొక్కలు పెంచుతామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment