Wednesday, January 13, 2010
యువతకు రోల్‌మోడల్ వివేకానందుడు-జిల్లా కలెక్టర్.
కోవూరు, (మేజర్ న్యూస్) : ప్రతి రంగంలోని ప్రతిభావంతులను ఇతరులు రోల్‌మోడల్‌గా ఎంచుకోవడం పరిపాటి, అలాగే యువతకు ఎప్పటికీ రోల్‌మోడల్‌గా వివేకానందుడు చిరస్థాయిగా నిలిచిపోయాడని జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ పేర్కొన్నారు. కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని పద్మజా ఆడిటోరియంలో మంగళవారం విలేకానంద 147వ జయంతి సందర్భంగా జరిగిన యువజన వారోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి యువత అవసరం ఎంతో వుందని, వివేకానందుడు ఆనాడే సూచించారని, ఆయన గుర్తుచేశారు.భారతదేశానికి యువతే దేశ సంపద అని, అటువంటి దేశసంపదైన యువత సంఘం కోసం, దేశం కోసం పాటుపడాలని సూచించారు. నేటి యువత వివేకానందుని మార్గదర్శకంలో నడిచి భారతీయ సంసృ్కతిని, గొప్పతనాన్ని చాటి చెప్పాలని కోరారు. అనంతరం ఇటీవల వచ్చిన వరదలకు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో వసతి గృహాలలోని విద్యార్ధులు పుస్తకాలు, దుస్తులు కోల్పోయారు. వారికి లేగుంటపాడులో మాక్స్ బ్యాంక్ ద్వారా సోపులు, పుస్తకాలను పంపీణీ చేశారు. మరలా వారికి 260 ట్రంకుపెట్టెలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.కేర్ అండ్ సపోర్ట్ సెంటర్‌కు అంగీకారం :- లేగుంటపాడు గ్రామంలో మాతా శిశుసంక్షేమ కేంద్రంలో నెల్లూరులోని వైఆర్‌జికె అనుబంద సంస్థగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కేర్‌అండ్ సపోర్ట్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సెట్నల్ సిఇఓ సుధాకర్, తహసీల్దార్ సుధాకర్, ఎంపిడిఓ శ్రీహరిరెడ్డి, రెడ్‌క్రాస్ సంస్థ కార్యదర్శి సుబ్రమణ్యం, లాటరీక్లబ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, సభ్యులు వేణోగోపాల్, ఒమ్మిన సతీష్, మాజీ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు, ప్రగతి యువకేంద్ర సిఇఓ గునపాటి ప్రసాద్‌రెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment