Wednesday, January 13, 2010
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
నెల్లూరు, మేజర్‌న్యూస్:దేశవ్యాప్తంగా ప్రస్తుతం విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వినియోగదారులను కోరారు. రూ.1.15 కోట్లతో స్థానిక డైకస్ రోడ్డు సెంటర్ (చేపల మార్కెట్) వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంక్షోభ నివారణకు ఎంతో కృషి చేస్తుందని, గతంలో రాష్ట్రంలో 18 లక్షల పంపుసెట్లు ఉచిత విద్యుత్‌ను పొందుతుండగా నేడు అవి 36 లక్షలకు చేరుకున్నాయన్నారు.అందరికీ విద్య, ఆరోగ్యంతోపాటు రైతులకు విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందిస్తుందన్నారు. దేశంలో సిక్కిం, ిహ మాచల్ ప్రదేశ్ వంటి కొద్ది రాష్ట్రాలు మినహా అనేక రాష్ట్రాల్లో ఈ విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో న్యూక్లియర్ పవర్‌పై ఆధారపడాల్సి ఉందని, ప్రత్యామ్నాయంగా సోలార్, విండ్ ఎనర్జీలను అభివృద్ధి చే సుకుని వ్యాపార పరంగా వాటిని వినియోగించుకోవాల్సి ఉందని, అందుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. నగరంలోని 16 ఇందిరమ్మ వార్డులలో లో వోల్టేజ్, కొత్త విద్యుత్ దీపాలు, తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లను వెచ్చిస్తుందన్నారు. సభకు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ నూతనంగా డైకస్ రోడ్డులో విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలకు లో వోల్టేజ్ సమస్య తీరిందన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్, ఆత్మకూరు బస్టాండు వద్ద మరో రెండు విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరయ్యాయని, త్వరలోనే వాటి నిర్మాణం జరుగుతుందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ త్వరలో కోటి రూపాయల వ్యయంతో చేపల మార్కెట్‌లో అధునాతన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. నగర మేయర్ భానుశ్రీ మాట్లాడుతూ నగరంలోని 16 ఇందిరమ్మ వార్డులలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలు తొలగిపోనున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నింటినీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఇ అశ్వత్థనారాయణ, కమిషనర్ టిఎస్‌ఆర్.ఆంజనేయులు, డిఇ సుబ్బరాజు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు సయ్యద్ సందానీబాష, జరీనా సుల్తానా, పిండి సురేష్, సంక్రాంతి కళ్యాణ్, సిరిగిరి చక్రవర్తి, వెంకటజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment