Friday, January 15, 2010
గ్రిగ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించండి
నెల్లూరు (స్పోర్ట్‌స) మేజర్‌న్యూస్: జిల్లాలో పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు 90 ఏళ్లుగా నిర్వహిస్తున్న గ్రిగ్ మెమోరియల్ క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ఈ క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే ఈ పోటీలకు మూడు శాతం నిధులను జడ్పీ సమకూరుస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలోని ఏడు జోన్లలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.జోన్ - నిర్వహించు స్థలం 1. నెల్లూరు - జడ్పీ బాలుర పాఠశాల, దర్గామిట్ట, నెల్లూరు2.రాపూరు - జడ్పీ హైస్కూల్, పొదలకూరు3.నాయుడుపేట - జడ్పీ హైస్కూల్, నాయుడుపేట4. గూడూరు - జడ్పీ హైస్కూల్, నేలటూరు5. కావలి - జడ్పీ హైస్కూల్, పాత బిట్రగుంట6.ఆత్మకూరు - జడ్పీ హైస్కూల్, నర్రవాడ 7.బాలికల జోన్ - గవర్నమెంట్ హైస్కూల్, పల్లిపాడుఆయా జోన్ల ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తమకు అవసరమైన క్రీడా సామాగ్రిని డిఎస్‌డిఒ నుంచి తెప్పించుకోవాలన్నారు. సంబంధిత మండలాధికారులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయ, సహకారాలతో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా క్రీడలను నిర్వహించాలన్నారు. జోన్‌ల వారీగా క్రీడా నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అంకిత భావంతో పాఠశాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను జిల్లా నుంచి అందించడంలో భాగస్వాములమవుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా విజేతలకు అందించే సర్టిఫికేట్లు, మెడల్స్ విషయాల్లో నాణ్యతను పాటించాలని, వారికందించే బహుమతులు వారికి ఉపయోగపడేలా చూడాలని ఆయన కోరారు. క్రీడాకారుల వసతి, భోజన, నీటి సరఫరా తదితర అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్రీడా స్థలాల్లో 108 వాహనం, ప్రధమ చికిత్స సామాగ్రి తప్పనిసరిగా ఉండాలని ఆయన ఆదేశించారు. సభకు అధ్యక్షత వహించిన జడ్పీ సిఇఒ మాట్లాడుతూ మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఎంఇఒలు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment