Monday, December 28, 2009
వైభవంగా వైకుంఠ ద్వారదర్శనం
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్:వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వైష్టవాలయాల్లో భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకోడానికి బారులు తీరారు. నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఇరువురు ఎమ్మెల్యేలతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను చేశారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు పెన్నానదిలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. భక్తులు దేవాలయంలోనికి వెళ్లడానికి, వెలుపలికి రావడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారదర్శనం, అమ్మవారి దర్శనం, కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వెలుపలికి రావడానికి ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల పై నుండి విఐపిలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment