Friday, January 1, 2010
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బడ్జెట్ 232 కోట్లు
చిల్లకూరు, (మేజర్‌న్యూస్) :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద నెల్లూరు జిల్లాకు ఈ ఏడాది 232 కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయించారని డ్వామా పి.డి., సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం డివిజన్ స్థాయి సమావేశాన్ని చిల్లకూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పది మండల స్థాయి అధికారులు, క్లస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ జనవరి నెల నుండీ ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులు రైతుల సేద్యాలకు నష్టం కలగకుండా చూడాలని వలసలు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ హామీ పథకం పనుల మీద ఆధారపడి జీవించు 50 కుటుంబాలను గుర్తించి వారికి పూర్తి కాలం పని కల్పించాలని ఎపిఒలకు సూచించారు. 2010 సంవత్సరంలో ప్రతి గ్రామం నుండి 100 కుటుంబాలకు (పూర్తిగా హామీ పథకం పనులు చేసుకొనువారిని) 12.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధుల కొరకు మండల సమావేశంలో ప్రతిపాదించి జిల్లా పరిషత్‌కు పంపితే అక్కడ ఆమోదింపచేసి జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరవుతాయని సుధాకర్‌రెడ్డి చెప్పారు. హార్టికల్చర్ ద్వారా మామిడి, బత్తాయి, ఇతర పంటలకు ఎరువులు, మందులు, కంచెకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా అంతర్‌సేద్యానికి కూడా నిధులివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు సన్న, చిన్నకారు రైతులకు అందాయా, లేదా తెలుసుకునేందుకు లబ్దిదారుల వివరాలు కంప్యూటర్‌లో భద్రపరుస్తున్నామని, 15 రోజులకు ఒక పర్యాయం సమీక్షా సమావేశం జరుపుతామని తెలిపారు. ప్రతి గ్రామంలో 100 రోజులు పని కల్పించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రవిచంద్రప్రకాష్, ప్రేమ్‌చంద్, విశ్రాంతికుమార్, ఎంపిడిఒ ప్రభాకర్‌రావు, టెక్నికల్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment