Monday, December 28, 2009
ఇక్కడ హోమియో వైద్యం ఉన్నా లేనట్లే
నాయుడుపేట, మేజర్‌న్యూస్: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి హోమియో వైద్యం ప్రజలకు అందించాలన్న ఉద్ధేశంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వైద్యశాలను ఏర్పాటు చేసిన ఇక్కడ వైద్యులు లేక పోవడంతో నిరుపయోగంగా మారింది. గత ఏడాది ఆసుపత్రికి బోర్డు అయితే తగిలించారు కానీ ఒక్కరోజుకూడా వైద్యం అందించిన పాపాన పోలేదు. ఇక్కడక్కి పోస్టింగ్‌చేసిన వైద్యురాలు బాధితలు స్వీకరించక పోవడంతో వైద్యశాల ఖాళీగా ఉంది వచ్చిన మందులు ఏమౌతున్నాయో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా నామమాత్రంగా ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులైన స్పందించి వైద్యశాలకు సిబ్బందిని నియమించి హోమియో వైద్యం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment