భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఏప్రిల్‌లో పిఎస్‌ఎల్‌విసి-19 ప్రయోగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది 5 ప్రయోగాలు విజయవంతంగా నింగిలోకి పంపాల్సి ఉండగా ఇప్పటికి ఒక్క ప్రయోగం జరగక పోవడంతో మిగిలినవి ఎప్పుడు జరుగుతాయోనని అనుమానం తలెత్తుతోంది. ఈ ఏడాది మార్చిలో ప్రయోగించాల్సిన పిఎస్‌ఎల్‌విసి-19 ప్రయోగం మరో నెలరోజుల పాటు వాయిదాపడి ఏప్రిల్‌లో ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె రాధాకృష్ణన్ బెంగుళూరులో మూడు రోజుల క్రితం జరిగిన ఇస్రో డైరెక్టర్లు, శాస్త్రవేత్తల సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం. మొదటి ల్యాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్ర వేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎస్ ఎల్‌విసి-19ని ప్రయోగించనున్నట్లు పేర్కొ న్నారు. ఈ ప్రయోగంలో శాటిలైట్ సాంకేతిక లోపం తలెత్తడంతో మార్చికు వాయిదా వేశారు. ఈ ప్రయోగం ద్వారా 1800 కేజీల బరువుగల రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ -1 ( ఆర్‌ఐశాట్-1) ను పంపనున్నారు. ఈ ఉపగ్రహంలో మైక్రోవేవ్ రిమోట్‌సెన్సింగ్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు అమర్చ నున్నారు. ప్రయోగం అత్యంత శక్తివంతమైనది కావడంతో చంద్రయాన్1కు ఉపయోగించిన స్ట్రాపాన్ మోటార్లును ఉప యోగిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో వాతావరణం అనుకూలంగా లేకున్న సమయంలో కూడా అంతరిక్షంలో ఫొటోలు సేకరించొచ్చు.
No comments:
Post a Comment