నెల్లూరు: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి ఇంకా ప్రసంగాలపై పట్టు సాధించనట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన ప్రచారం నిర్వహించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త తత్తర పడేవారు. ఆ తర్వాత కాగితం ముందు పెట్టుకొని మాట్లాడేవారు. అయితే ఇప్పటికీ ఆయన ప్రసంగం క్లియర్‌గా లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే సమయంలో చిరంజీవి అక్కడక్కడా తత్తరపాటుకు గురయ్యారు. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆ తర్వాత మాట్లాడాల్సింది గుర్తుకు రాక కార్యకర్తలను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవి ప్రదర్శన పేలవంగా ఉందని కాంగ్రెసు నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.
మరోవైపు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు చిరంజీవి ప్రచారంలో అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవితో ఇన్నాళ్లూ రాసుకుపూసుకు తిరిగిన వారు ప్రచారం సమయంలో కొన్ని చోట్ల చిరంజీవి వాహనంలో కనిపించారు. మరికొన్ని చోట్ల ఎక్కడో జనంలో ఉండిపోయారు. దీంతో సొంత పార్టీ నుండి కూడా చిరంజీవికి మద్దతు కరువైందా అనే ప్రశ్న పలువురిలో
No comments:
Post a Comment