నెల్లూరు: కోవూరు ఉప ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్టస్థ్రాయి నాయకులు కోవూరు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాల కోసం రాష్ట్ర స్థాయి నాయకులు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించడంతోపాటు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదన్న వ్యాఖ్యలు ఆ నియోజకవర్గం ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గ్రామస్తులు రాత్రి సమయాల్లో ఆయా గ్రామాల రచ్చబండల వద్ద చేరి ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ గ్రామాలకు ఏ నాయకులొచ్చారు, ఏమేం చెప్పారు అన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో పర్యటించిన నాయకుల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలతోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రం నాయుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా, కెవి.కృష్ణమూర్తి, వైఎస్‌ఆర్‌సి పార్టీ నుంచి జూపూడి ప్రభాకర్ తదితరులు ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది.
ఈ నేపథ్యంలో వీరు ఓటర్లను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా రోడ్‌షోలను నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరిమీద ఒకరు, ఒకపార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకున్నట్టు ప్రచారంలో ప్రసంగించడంతో నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎవరు ఏమి చెబుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో తలలు గోక్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీలు కుమ్మక్కయ్యాయని’, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నాయని దుయ్యబడుతూ తమ పార్టీని, పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోవూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. అలాగే వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పర్యటించి తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ‘కుమ్ముక్కయ్యాయని’ రాష్ట్రంలో అస్థిరత పాలనను కొనసాగిస్తున్నాయని, ఆ రెండు పార్టీలను తరిమి కొట్టాలని, తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవలు, పేద, మధ్య తరగతి ప్రజలకు అందించిన ఫలాలను గురించి తెలియజేస్తూ ప్రచారాలను, రోడ్‌షోలను నిర్వహించారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రె ండు రోజుల క్రితం కోవూరు పర్యటనలో రాజుపాళెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏకంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీలు ‘కుమ్ముకై్క’ ప్రజలను మభ్యపెడుతున్నాయని, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన ప్రచారాలను ఒక్కసారి పరిశీలిస్తే రాష్టస్థ్రాయి నుంచి వచ్చిన నాయకుల్లో ప్రతిఒక్కరి నోటా ప్రతి రెండు పార్టీలు ‘కుమ్ముకై్క’ అయ్యారన్న పదాలు తప్ప ప్రజల సంక్షేమం గురించి, ప్రజలు పడుతున్న కష్టాల గురించి వివరించే నాధుడే లేడని, అంతా కుమ్మక్కులనే మాట్లాడుకుంటూ, దుమ్మెత్తి పోసుకోవడంపై ప్రజలు వారి మాటల పట్ల విసుగెత్తిపోయి అసహ్యించుకుంటున్నారు. వీరికి తోడు కొంతమంది మంత్రులు, తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీల నేతలు కూడా కొంతమంది ఇదే ధోరణి అవలంబిస్తుండడంతో ప్రజలు ఆయా బహిరంగ సభల వద్ద కొంతసేపే వుండి, ఇది రోజూ జరుగుతున్న తంతే కదరా... వెళ్లిపోదాం రండి అంటూ అక్కడ నుంచి నిష్ర్కమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ నాయకులు నాలుకలకు నరం లేదని, వారు చెప్పిందే వేదమైపోతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తూ వీరి ప్రసంగాలపై విమర్శలు చేసుకుంటూ తాము మాత్రం ఏ పార్టీకి ఓటు వేయాలో ఇప్పటికే మదిలో నిర్ణయించుకోవడంతోపాటు జరుగుతున్న ప్రచారాలకు, మీటింగులకు తూతూ మంత్రంగా హాజరవుతున్నారు. దీంతో నాయకుల్లో ఇప్పటికే ప్రజలు ఏ పార్టీ పక్షాన ఉన్నారో అన్న విషయం అర్థం గాక తికమకపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో తమకు తప్పదని, ఈ ప్రచారాలకు, రోడ్‌షోలకు రావడం పరిపాటైపోయింది. ఏది ఏమైనప్పటికీ రానున్న కొద్ది రోజుల్లో అభ్యర్థుల భవిష్యత్తు తేలనుందని ప్రజలు వ్యాఖ్యానించుకుంటున్నారు.
No comments:
Post a Comment