
నగదు పట్టుకున్న కొద్ది సేపటికే.. మంత్రి ఆనం ఇలాకా నుండి ఓ ఫోన్ కాల్ రావడంతో నగదు వ్యవహారంలో తర్జన భర్జనలు సాగాయి. తొలుత 3.5లక్షలకు మాత్రమే తగిన ఆధారాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు విషయం మీడియాకు తెలియడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అదే సమయంలో ఓ కేసు నిమిత్తం సూళ్లూరుపేటకు వచ్చిన గూడూరు డిఎస్పీ సురేష్ కుమార్ సైతం నగదు పట్టుబడ్డ వైనాన్ని జిల్లా ఎస్పీకి తెలిపామని, ఉత్తర్వులు కోసం ఎదురుచేస్తున్నామని తెలపారు. వ్యవహారాన్ని జాగుచేస్తే ఎన్నికల కమిషన్ నుండి తాకీదులు అందుకోవాల్సి వస్తుందని భావించిన పోలీసులు మధ్యాహ్నం ప్రాంతంలో కేసును తహశీల్దారుకు అప్పగించారు. ఈలోపే బయటవారు కొందరు వ్యక్తులు కొన్ని కాగితాలను నగదు పట్టుబడ్డ వ్యక్తులకు అందచేయడం వంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. హైడ్రామా అనంతరం నగదు, ఇద్దరు వ్యక్తులతో సహా కారును పోలీసు స్టేషన్ నుండి పట్టుబడ్డ ప్రాంతమైన హోలీక్రాస్ సెంటర్ వద్దకు తరలించి సూళ్లూరుపేట తహశీల్దారు సుబ్రమణ్యం సమక్షంలో లెక్కించారు.
ఈ నగదు ఓజిలి మండలం రాజుపాళెంకు చెందిన ప్రీమియర్ మైకా కంపెనీకి చెందిన నగదుగా తెలియవచ్చిందని తహశీల్దార్ సుభ్రమణ్యం, సీఐ హనుమంతరావులు తెలిపారు. . అడ్వాన్స్ పన్ను 4లక్షలను నెల్లూరులో కట్టేందుకు తీసుకెళ్లుతున్నారని, అదే విధంగా మిగిలిన 4.5లక్షల ఉద్యోగుల జీతాల కోసం తీసుకువెళ్లుతున్నట్లు తెలిపారు.
ఇదే ప్రాంతంలో గత నెల చివరివారంలో 19లక్షల క్యాష్ ను పట్టుకొన్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కాని ఇప్పుడు పట్టుబడ్డ 8.5లక్షల నగదుపై కొంత హైడ్రామా నడపడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికార పార్టీ నేతల వత్తిళ్లకు పోలీసులు, రెవిన్యూ వర్గాలు తలవంచక తప్పలేదనే ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment