నెల్లూరు : కోవూరు ఉప ఎన్నికల్లో అథోగతి తప్పదని భా వించిన ఆనం సోదరులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఉదయగిరి తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించా రు. వారు చీటింగ్‌కు మారుపేరు గా మారారన్నారు. ఆయన గురువారం తన అతి థి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రా మనారాయణ రెడ్డి ఇటీవల కాలంలో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, తమ సోదరులపై చే స్తున్న విమర్శలను, ఆరోపణలను ఆయన తీవ్రం గా ఖండించారు. ఇటీవలకాలంలో ఆయన అధికా ర వ్యామోహంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతు న్నారని, ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు అతి వినయ విధేయతలు ప్రదర్శించి, ఆయన పు ణ్యమా అని పదవులను అడ్డం పెట్టుకుని రూ. కోట్లు సంపాదించుకున్నారన్నారు.
రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వారి అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడపెట్టుకున్నారని విమర్శించారు. ము న్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంతకానికీ వెలకట్టిన ఘనుడు ఆనం రామనారాయణరెడ్డేనన్నారు. అప్పటి మున్సిపల్ శాఖ కార్యకలాపాలపై సీబీఐ దృష్టి సారిస్తే ఆయన భాగోతాలు బ యటపడతాయన్నారు.వైఎస్సార్ హయాంలో కేబి నెట్ మంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు తమదేమీ లేదని, అంతా ముఖ్యమంత్రిదేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడ లాభం ఉంటే ఆ పంచన చేరే ఆనం సోదరులకు యువనేతను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీ సీటు కోసం సోనియా గాంధీ వద్ద పడిగాపులు కాశారని, తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ పుణ్యమా అని ఆయనకు రెండుసార్లు ఎంపీ సీటు లభించిందన్నారు. తనకు కూడా మూడుసార్లు ఎమ్మెల్యే సీటు వచ్చిం దంటే అది మహానేత చలువ వల్లేనన్నారు. ఆనం సోదరులకు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి వారికి రాజకీయభిక్ష పెట్టింది ఆ మహానేతేనన్నారు. అలాంటిది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విధంగా ఆనం సోదరులు ప్రస్తుతం పదవుల కోసం విశ్వసనీయతను, విలువలను మంటగలిపి వ్యవహరిస్తున్నారన్నారు.
నయవంచకులెవరో తేల్చుకుందాం రండి
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, తమ సోదరులను నయవంచకులని పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవ రు నయవంచకులో తేల్చుకునేందుకు సిద్ధమా? అని ఆనం సోదరులకు సవాలు విసిరారు. నెల్లూరును మున్సిపాల్టీ స్థాయి నుంచి నగర స్థాయిగా మార్చిన ఆ మహానేత ఆశయాలకు వారు తిలోదకాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో నామమాత్రంగా పనులు చేయించి, అధిక శాతం నిధులు వారి జేబుల్లోకి, వారి అనుచరులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వారి ఆగడాలకు అడ్డొచ్చిన అధికారులను ఇంట్లో పనివారి కన్నా హీనంగా దూషిస్తున్నారని విమర్శించారు.
అధికారులు కూడా ఆత్మాభిమానం చంపుకుని పని చేయాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. అలా పదవులను ఇచ్చిన ప్రజల సొమ్మునే దోచుకుంటున్న ఆనం సోదరులు నయవంచకులా..? పదవులకు న్యాయం చేసి నియోజకవర్గ అభివృద్ధి కి పాటుపడుతున్న తాము నయవంచకులమో ప్రజలకే తెలుసన్నారు. దీనిపై ఎక్కడైనా చర్చావేదికకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే రాజమోహన్‌రెడ్డి దీనిపై సవాల్ విసిరారని గుర్తు చేశారు.
No comments:
Post a Comment