నెల్లూరు, : పార్లమెంటులో బుధవారం రైల్వే శాఖ మంత్రి దినేష్‌త్రివేది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత బడ్జెట్‌నే కొత్త తరహాలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో దక్షణమధ్య రైల్వేకి అత్యంత కీలకంగా వున్న విజయవాడ రైల్వే జంక్షన్ కీలక జోన్‌గా ఉన్నప్పటికీ రాష్ట్రానికి, తద్వారా జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దక్షణ మధ్య రైల్వే నుంచి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్లో అతి స్వల్పంగా అభివృద్ధికి నిధులను కేటాయించడంపై దక్షణ మధ్యరైల్వే కింద వున్న జిల్లాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. నెల్లూరు జిల్లాకు చెందిన 9 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కాని, నెల్లూరు జిల్లాకు కాని రైల్వే శాఖ విస్మరించడం ప్రజల ఆగ్రహానికి గురి చేస్తోంది.
అయితే రైల్వే శాఖ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. జిల్లా నుండి ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలు విజయవాడకు, హైదరాబాద్‌కు, చెనై్నకు వివిధ వ్యాపారాల నిమిత్తం రోజూ వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతేగాక జిల్లాలోని ఉద్యోగస్తులు పై ప్రాంతాల్లో ఉండడంతో వారు కూడా రాకపోకలు సాగించడం తెలిసిన విషయమే. రైల్వే చార్జీలు పెంచడంతో వీరికి తీవ్రంగా తడిపి మోపెడవుతుందన్న వ్యాఖ్యలు సదరు ఉద్యోగస్తుల నుండి వినిపిస్తున్నాయి. ప్రతి 135 కి.మీ.లకు రూ.4ల వంతున చార్జీలను పెంచడం జరిగింది. సెకండ్ క్లాస్ ఎసికి కిలోమీటరుకు 0.15 పైసలు వంతున, స్లీపర్ కోచ్‌కు కిలోమీటరుకు 5 పైసల వంతున ఎసి 2టైర్‌కు కిలోమీటరుకు 15 పైసల వంతున చార్జీలను పెంచడం జరిగింది.
మొదటి తరగతి ప్రయాణీకులకు ఎసి ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు కిలోమీటరుకు 30 పైసల వంతున పెంచడంతో రైల్వే ప్రయాణీకులపై అదనపు భారం పడుతుంది. దీనికి తోడు ప్యాసింజర్ రైలు కిలోమీటరుకు 2 పైసలు, ప్యాసింజర్ మెయిలుకు కిలోమీటరుకు 3 పైసల వంతున పెంచగా, ప్లాట్‌ఫారం టిక్కెట్టు రూ.3ల నుండి రూ.5ల వరకు పెరగడం జరిగింది. ఇకపోతే జిల్లా 9 మంది ఎంపిలు ఉన్నప్పటికీ కేవలం వీరుపార్లమెంటులో ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండడం తప్ప రాష్ట్రానికి, తద్వారా జిల్లాల రైల్వే అభివృద్ధికి తీసుకురావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయించకపోవడంపై ఎంపిలు ఉన్నా లేనట్లే అయింది.
ఇకపోతే 75 కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 21 కొత్త ప్యాసింజర్ రైళ్లను 2012-13 సంవత్సరానికి తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో రైల్వేశాఖ మంత్రి ప్రకటించారు. అలాగే 2012-13 సంవత్సరానికి గాను 213 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన నిరుద్యోగులకు కొంతవరకు ఊరట కలిగించినప్పటికీ బడ్జెట్ మాత్రం ప్రజలకు ఆమోదకరంగా లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

No comments:
Post a Comment