కోవూరు : కోవూరు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రచారం నిమిత్తం పద్మభూషణ్, డాక్టర్ కొణిదల చిరంజీవి సోమవారం ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో రోడ్‌షో నిర్వహిస్తారని నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానిక ఏసీ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9 గంటలకు ఇందుకూరుపేట మండలంలోని డేవిస్‌పేట నుండి కొత్తూరు, ఇందుకూరుపేట, మైపాడు, గంగపట్నం, రావూరు, జగదేవిపేట, మధ్యాహ్నం 2.30 గంటలకు జొన్నవాడ సెంటర్‌లో, పెనుబల్లి, కళాయికాగల్లు, రేబాల నాగమాంబపురం, ఇస్కపాళెం, పోలినాయుడు చెరువు, ముసులపూడి, కట్టుబడిపాళెం, బుచ్చి హరిజనవాడ, బుచ్చిబస్టాండ్ సెంటర్‌లలో రోడ్‌షోలు నిర్వహిస్తారన్నారు.
అలాగే 13వ తేదీ పీసీసీ అధ్యక్షులు బొత్సా సత్యనారాయణతో కలసి చిరంజీవి పడుగుపాడు, ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు, ముదివర్తి, అన్నారెడ్డిపాళెం, విడవలూరు మండలంలోని ఊటుకూరు, పెద్దపాళెం, రామతీర్థం, దండిగుంట, వరిణి, గాజులదిన్నె, వావిళ్ల, దంపూరు, చౌకచర్ల, పద్మనాభసత్రం, గుండాలమ్మపాళెం సెంటర్, బసవాయపాళెం సెంటర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు కొడవలూరు, 7.30 గంటలకు నార్తురాజుపాళెం, 8 గంటలకు కోవూరు రోడ్‌షోలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవిని కోవూరు ప్రజలు, చిరంజీవి అభిమానులు ఆశీర్వదించాలని ముంగమూరు తెలిపారు. అలాగే ఈ నెల 18వ తేదీ జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి గుర్తు అయిన హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రంగయ్యనాయుడు, రవికుమార్ యాదవ్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
నేడు చిరంజీవి రాక
కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు చిరంజీవి తొలిసారిగా కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట, బుచ్చి మండలాలకు సోమవారం రానున్నారు. పిఆర్‌పి అధ్యక్షుడుగా వున్న చిరంజీవి ఇటీవల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుని హోదాలో పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిమిత్తం రోడ్‌షోకు రానున్నారు. చిరంజీవి రాకసందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

No comments:
Post a Comment