ఈ నెల 18న జరుగనున్న కోవూరు నియోజక ఉప ఎన్నికలో నియోజ కవర్గానిక సంబంధంలేని కొత్త వ్యక్తులు, ప్రజా ప్రతినిదులు నియోజక వర్గంలో సంచరించరాదని జిలా కలెక్టర్ బి.శ్రీదర్ సూచించారు. నగరంలోని కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుందన్నారు. నియోజక వర్గంలో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా నియంత్రించేందుకు ప్రతి మండలంలో రెండు పోలీస్ మొబైల్ టీమ్‌లను నిఘాఉంచడం జరిగిందన్నారు. పోలింగ్ రోజున పార్టీ ఏజెంట్లు ఉదయం ఏడు గంటలకే హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
ఏజెంట్లు ఆ పోలింగ్ పరిధిలోని ఓటరు అయి ఉండాలన్నారు. ఏజెంట్లు పాస్‌పోర్టు సైజ్ ఫోటో రెండింటిని తమ వెంట తీసుకుని రావాలన్నారు. పోలింగ్ రోజున ఏజెంట్లు, రిలీవింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి సాయంత్రం మూడు గంటల తర్వాత బయటకు అనుమతించరని తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్ళ దలిస్తే లోనికి వచ్చేందుకు వీలులేదన్నారు. అభ్యర్థులు, రాజకీయపార్టీల వారికి మూడు వాహనాల్లో తిరిగేందుకు మాత్రమే అనుమతిస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లకు ఓటరు స్లిప్‌లను పంపిణీ కొనసాగుతుందని, నేటి వరకు 87శాతం పంపిణీ జరిగిందని తెలిపారు. 21వ తేదీ కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లు తమ వివరాలను ఎన్నికల అధికారి అందజేయాలని తెలిపారు.
ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న నగదు కోటి 15లక్షలు, మద్యం 7501 సీసాలను పట్టుకోవడం జరిగిందన్నారు
No comments:
Post a Comment