సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో భారీగా నగదు వసూలు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా పార్టీని అమ్మకం పెట్టిన చిరంజీవిని చూసి ఓట్లు వేసే స్థితిలో నేడు ప్రజలు లేరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె.ఎర్రంనాయుడు, గాలి ముద్దు కృష్ణమనాయుడులు వ్యాఖ్యానించారు. ఆదివారం వారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవిని నమ్మి ఇతర పార్టీలను వదులుకొన్న అభిమానులను నిట్టనిలువునా మోసం చేసిన ఆయనకు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రచారం చేసే నైతిక హక్కులేదన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రచారం చేస్తారో తెలపాలన్నారు.
ప్రజల, అభిమానుల అభిమానాన్ని ఢిల్లీలో సోనియాగాంధీ దగ్గర డబ్బు సంచుల కోసం తాకట్టు పెట్టిన చిరంజీవికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నైతిక ఉందా? అని ప్రశ్నించారు. అవినీతి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవూరు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని దేశ వ్యాప్తంగా భోగస్ కంపెనీల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలను దోచుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి తీహార్ జైల్లో చిప్పకూడు తినేరోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. అధికార కాంగ్రెస్‌పార్టీ జగన్‌మోహన్‌రెడ్డితో రహస్య ఒడంబడిక చేసుకుని పైకి మాత్రం మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలనకు తోడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అవినీతి రాష్ర్తంలో రాజ్యమేలుతుందని దీనిని ప్రజలు గమనించి తీర్పు నివ్వాలని కోరారు.
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో చిన్న మచ్చకూడా లేకుండా జాతీయ నేతల నుంచి ప్రశంశలు అందుకొన్న తెలుగుదేశం పార్టీకి కోవూరు ప్రజలు పట్టంకట్టాలని తీర్పు నిచ్చారు.
No comments:
Post a Comment