ఈ నెల 18వ తేదిన జిల్లాలోని కోవూరు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్, తెదేపా అభర్ధుల గెలుపుపై నెల్లూరు ఎక్కడ చూసినా క్రింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు చూపు కోవూరుపైనే ఉంది. దీంతో కాయ్‌రాజకాయ్ అంటూ పందాలు కాస్తున్నారు. కొంత మంది కోవూరు నియోజక వర్గంలో వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలపరుస్తున్న అభ్యర్ధి నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సుమారు 25వేల ఓట్ల మేజార్టీతో ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుస్తాడని మరికొంత మంది అధికార పార్టీకి చెందిన పొలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గెలుపు తధ్యమని, ఇంకోంత మంది ప్రతిపక్ష పార్టీకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపు తధ్యమని ఎవరికి తోచిని ఆలోచనలు వారు జోస్యాలు చెప్పుకుంటున్నారు.
తెదేపా అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవక పోతే భవిష్యత్తులో రాజకీయ యోగమే లేదని దేశం పార్టీకి చెందిన వారే ఖరాఖండిగా చెబుతున్నారు. అంతేకాదు జగన్ అండదండలతో ప్రసన్న గెలుపు జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో మేజార్టీ వస్తుందని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే సోమిరెడ్డి గెలుపు కూడా తధ్యమని మరి కొంత మంది చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పోలంరెడ్డి రెండవ స్థానమని కొంత మంది, ప్రసక్తే లేదు తెలుగు దేశం పార్టీ రెండో స్థానంపై కూడా పందాలు కాస్తున్నారు. ఏదేమైనప్పటికీ కోవూరు అసెంబ్లీ స్థానం తెలుగు దేశమా, వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్సా అని మూడు పార్టీల నాయకులు పచ్చ కామెర్లు ఉన్న వ్యక్తి అందరూ పచ్చగా కనబడుతారన్న రీతిలో ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ గెలుస్తోందని చెప్పుకోంటున్నారు.
No comments:
Post a Comment