కోవూరు : కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఆనం సోదరులే ఓడిస్తారని వైఎస్సార్సీ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలంరెడ్డిని ఓడించి ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు ఆనం సోదరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కోవూరు ఉపఎన్నికల నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. రాజుపాళెంలోని జరిగిన సీఎం బహిరంగ సభకు భారీ స్థాయిలో బస్సులు, లారీలు, టెంపోలలో జనాన్ని సమీకరించి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. అంతేగాక మహిళలను అవమాన పరిచేలా కాంగ్రెస్ నాయకులు రికార్డు డ్యాన్సులు ఏర్పాటు చేశారని వెంటనే ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనం వివేకానందరెడ్డి సీఎం సభలో రికార్డు డాన్స్‌లు ఏర్పాటు చేశాడని, ఆయన చీర కట్టుకొని ఉంటే బాగుండేదన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పది గంటలు దాటాక ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు జగన్ ప్రభంజనం అధికమవుతోందని కోవూరులో తన గెలుపునకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఈ నెల 14వ తేదీన జగన్ పర్యటించనున్నట్లు ప్రసన్న తెలిపారు. ఈ సమావేశంలో నటి రోజా, వైఎస్సార్సీ పార్టీ నాయకులు శంకర్‌రెడ్డి, భక్తవత్సలరెడ్డి, సతీష్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment