విడవలూరు: రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకున్న వైఎస్‌ఆర్‌సి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కోవూరు ఉప ఎన్నికల సంద ర్భంగా బుధవారం విడవలూరు మండలంలోని విడవలూరు, ముదివర్తి, పార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించారు. గతంలో ఆరేళ్లు పనిచేసిన ముఖ్యమంత్రి అవినీతి ద్వారాలు తెరిస్తే తర్వాత వచ్చిన మంత్రులు ద్వారాలే లేకుండా రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, అలాంటి పార్టీలను ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ రెండు పార్టీలకు లేదన్నారు. అవినీతి కాంగ్రెస్ అనే వృక్షంలోని కొమ్మే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏ రోజుకైనా ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకతప్పదని ఆయన జోస్యం చెప్పారు.
జగన్ లక్షకోట్లు అవినీతికి సమాధానం చెప్పకుండా సిబిఐ విచారణకు వస్తే ఇంట్లో దాక్కొనే పిరికి వ్యక్తి అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అవినీతికి పాల్పడిన జగన్ సమాధానం చెప్పేంతవరకు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు అవినీతి గుర్తుకొస్తుందని ఆయన అన్నారు. జగన్ పక్కన వున్న ప్రసన్న ఎక్కడ నుంచి ఊడిపడ్డారని ఆయన ప్రశ్నించారు. 1993 నుంచి 2004 వరకు ఆయనకు టిక్కెట్టు ఇచ్చి ఆయన గెలుపునకు కారణమైన పార్టీని వదిలిపెట్టి వెళ్లడం సిగ్గుచేటన్నారు. 2009 ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒక గూండా, ఒక రౌడీ అని ప్రచారం చేసి ఈ రోజు రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లను దేవుళ్లు అనడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
సోమశిల నీళ్లు కడపకు వెళ్లకుండా కాపాడిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డఇని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత కోవూరు ప్రజలపై ఉందని ఆయన కోరారు.
No comments:
Post a Comment