గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే కూడా రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పరిపాలన భేష్‌గా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో సంక్షేమ ఫలాలను సమర్థవంతంగా సిఎం కిరణ్ అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయారని వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై ఆయన ధ్వజమెత్తారు. వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తూ వాటికి కొత్త రూపాన్ని ఇస్తున్నారని ఏ మోహం పెట్టుకుని విమర్శిస్తారో అర్థం కావడంలేదని లగడపాటి జగన్‌పై విరుచుకు పడ్డారు.
రాష్ట్రంలో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యంలేక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణా రాష్ర్త సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావులు కుమ్మకై కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్రబన్నారని రాజగోపాల్ ఆరోపించారు. కోవూరు ఉప ఎన్నికలు నీతికి అవినీతికి జరిగే పోరాటమని ఈ ఎన్నికల ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్ , పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు.

No comments:
Post a Comment