కోవూరు : ఎప్పుడెప్పుడు ఎన్నిక జరుగుతుందోనని ఎదురుచూస్తున్న నాయకులు, ప్రజలు కోవూరు నియోజకవర్గంలో నేడు జరుగుతున్న ఉప ఎన్నికకు ఊపిరి పీల్చుకోనున్నారు. నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో 255 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక జరుగనుంది. ఇందుకూరుపేట మండలంలో పురుషులు 19,690, మహిళలు 20,615, బుచ్చి మండలంలో పురుషులు 25,222, మహిళలు 26,910, కోవూరు మండలంలో పురుషులు 23,624, మహిళలు 25,633, కొడవలూరు మండలంలో పురుషులు 15,702, మహిళలు 16,952, విడవలూరు మండలంలో పురుషులు 16,279, మహిళలు 17,553 మంది, మొత్తం నియోజకవర్గంలో 2,08,180 మంది ఓటర్లు ఆదివారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటుహక్కును వినియోగించు కోవచ్చు.
నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ నిమిత్తం ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరు కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మైక్రో అబ్జర్వర్‌లుగా విధులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ సిస్టమ్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాప్‌ట్యాప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా అభ్యర్థి ఓటింగ్ విధానం, అక్కడ జరుగుతున్న వాయిస్ రికార్డింగ్‌ను వెబ్ కెమెరా ద్వారా కవరింగ్ చేయనున్నట్లు, దీనికి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు విధుల్లో కొనసాగనున్నట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment